Share News

ఎరువుల దుకాణాల తనిఖీ

ABN , Publish Date - Jul 06 , 2024 | 11:42 PM

ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ, విజిలెన్స అధికారులు సంయుక్తంగా శనివారం తనిఖీ చేశారు. ఏలూరు జిల్లా పుంగనూరు సబ్‌డివిజన వ్యవసాయ సహాయ సంచాలకుడు శివకుమార్‌, విజిలెన్స శాఖ సబ్‌ ఇనస్పెక్టర్‌ రంజితకుమార్‌ మడకశిర పట్టణంలోని లక్ష్మీఆదినారాయణ ట్రేడర్స్‌ ఎరువుల దుకాణంలోని నిల్వలను తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిషా్ట్రర్‌లోని ఎరువులకు, ఎరువుల నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో 15.45 టన్నులు, పది రకాల ఎరువులను వాటి విలువ రూ.14.59లక్షల ఎరువులను సీజ్‌ చేశారు.

ఎరువుల దుకాణాల తనిఖీ

మడకశిర, జూలై 6: ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ, విజిలెన్స అధికారులు సంయుక్తంగా శనివారం తనిఖీ చేశారు. ఏలూరు జిల్లా పుంగనూరు సబ్‌డివిజన వ్యవసాయ సహాయ సంచాలకుడు శివకుమార్‌, విజిలెన్స శాఖ సబ్‌ ఇనస్పెక్టర్‌ రంజితకుమార్‌ మడకశిర పట్టణంలోని లక్ష్మీఆదినారాయణ ట్రేడర్స్‌ ఎరువుల దుకాణంలోని నిల్వలను తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిషా్ట్రర్‌లోని ఎరువులకు, ఎరువుల నిల్వలకు వ్యత్యాసం ఉండటంతో 15.45 టన్నులు, పది రకాల ఎరువులను వాటి విలువ రూ.14.59లక్షల ఎరువులను సీజ్‌ చేశారు. అదేవిధంగా 47 లిట్‌ రూ.1.01లక్షల పురుగు మందుల అమ్మకాలను నిలిపివేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని డీలర్లకు హెచ్చరించారు. రశీదు లేకుండా అమ్మితే చర్యలు తప్పవన్నారు. సహాయ వ్యవసాయ సంచాలకులు కృష్ణమీనన, మండల వ్యవసాయ అధికారి తిమ్మప్ప పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2024 | 11:42 PM