Insurance టమోటా పంటకు బీమా వర్తింపు
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:58 AM
రబీలో రైతులు సాగు చేసిన టమోట పంటకు వాతావరణ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కళ్యాణదుర్గం, రాయదుర్గం ఉద్యాన అధికారులు కృష్ణతేజ, మౌనిక సోమవారం ప్రకటనలో తెలిపారు.
కళ్యాణదుర్గంరూరల్/బెళుగుప్ప/ రాయదుర్గం రూరల్/ బొమ్మనహాళ్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రబీలో రైతులు సాగు చేసిన టమోట పంటకు వాతావరణ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కళ్యాణదుర్గం, రాయదుర్గం ఉద్యాన అధికారులు కృష్ణతేజ, మౌనిక సోమవారం ప్రకటనలో తెలిపారు.
టమోటా పంట సా గు చేసిన రైతులు ఈ క్రాప్ నమోదు చేయించి ఎకరాకు రూ. 1600 ప్రీమి యం డిసెంబరు 15 వ తేదీ లోగా చెల్లించాలన్నారు. పంటనష్టం వాటిల్లితే ఎకరాకు రూ. 32 వేలు బీమా వర్తిస్తుందన్నారు. బ్యాంకులో రుణాలున్న రైతులు అక్కడే ప్రీమియం కట్టవచ్చన్నారు. రుణాలు లేని రైతులు ధ్రువీకరణ పత్రాలతో రైతు సేవా కేంద్రాల్లో చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు ఇన్సూరెన్స కంపెనీ జి ల్లా అధికారి కృష్ణసాగర్ 9912275799ను సంప్రదించాలని వారు సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తలు..