Share News

SKUVC: విద్యార్థి దశనుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:02 AM

విద్యార్థి దశనుంచే క్రీడల్లో పాల్గొనే ఆసక్తిని పెంచుకోవాలని ఎస్కేయూ ఇనచార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ అనిత పేర్కొన్నారు

SKUVC: విద్యార్థి దశనుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
SKU VC paying tribute at Dhyan Chand's portrait

అనంతపురం సెంట్రల్‌/క్లాక్‌టవర్‌, ఆగస్టు 29: విద్యార్థి దశనుంచే క్రీడల్లో పాల్గొనే ఆసక్తిని పెంచుకోవాలని ఎస్కేయూ ఇనచార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ అనిత పేర్కొన్నారు. ఎస్కేయూలో నిర్వహించిన జాతీయ కీడ్రా దినోత్సవ వేడుకల్లో ప్రొఫెసర్‌ అనిత, రెక్టార్‌ వెంకటనాయుడు, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు. ధ్యానచంద్‌ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఎస్వీ డిగ్రీ కళాశాల, రుద్రంపేట ప్రభుత్వ పాఠశాలలోనూ జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వవహించి విద్యార్థులకు పోటీలు నిర్వహించారు.

క్రీడలతో అంతర్జాతీయ గుర్తింపు: క్రీడలతో అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని, అందుకు హాకీ దిగ్గజం ధ్యానచంద్‌ నిదర్శనమని జేఎనటీయూ ఓస్‌డీటు వీసీ ప్రొఫెసర్‌ దేవన్న అన్నారు. బుధవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జేఎనటీయూలో ధ్యానచంద్‌ జయంతి వేడుకలు, విద్యార్థులకు కీడ్రా పోటీలను నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ చెన్నారెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ వసుంధర పాల్గొన్నారు.


ఎస్‌ఎ్‌సబీఎనలో: నగరంలోని ఎస్‌ఎ్‌సబీఎన కళాశాలలో క్రీడాదినోత్సవాన్ని నిర్వహించారు. మేజర్‌ ధ్యానచంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రీడాపోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు విశ్వనాథ్‌ చౌదరి, కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌రాజు, అధ్యక్ష, కార్యదర్శులు రమణారెడ్డి, పీఎల్‌ఎన రెడ్డి, సభ్యుడు ఎర్రిస్వామి, పీడీ ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఆర్ట్స్‌ కళాశాలలో: మేజర్‌ ధ్యానచంద్‌ జయంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక ఆర్ట్స్‌ కళాశాలలో జాతీయ క్రీడాదినోత్సవాన్ని నిర్వహించారు. క్రీడాపోటీల విజేతలకు బహుమతులు ప్రదానంచేశారు. ప్రిన్సిపాల్‌ దివాకర్‌ రెడ్డి, పీడీలు జెబీవుల్లా, శ్రీరామ్‌, ఏఓ రమణ పాల్గొన్నారు.

రాప్తాడు: విద్యార్థులు విద్యతో పాటూ క్రీడల్లోనూ రాణించాలని సర్పంచ సాకే తిరుపాలు సూచించారు. జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గురువారం ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు. ఇనచార్జి హెచఎం నరసింహులు, పీఈటీ కేశవమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 12:02 AM