APTA: మధ్యంతర భృతి ప్రకటించాలి
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:33 AM
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మధ్యంతరభృతి ప్రకటించాలని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గణపతి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయభవనలో ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన (ఆప్టా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు.
అనంతపురం విద్య, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మధ్యంతరభృతి ప్రకటించాలని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గణపతి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయభవనలో ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన (ఆప్టా) రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. సమావేశానికి గణపతి, ప్రధాన కార్యదర్శి కాకి ప్రకా్‌షరావు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. వారు మాట్లాడుతూ జీవో 117 రద్దుచేసి ప్రైమరీ స్కూళ్లను 1 నుంచి 5వ తరగతి వరకూ కొనసాగించాలన్నారు. మధ్యంతర భృతి ప్రకటించడంతోపాటు, 12వ పీఆర్సీ కమిషన నియమించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రైమరీ స్కూల్ టీచర్లు ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. ప్రభుత్వం సైతం ప్రైమరీ విద్యపై దృష్టి సా రించాలని కోరారు. సీపీఎస్, జీపీఎ్‌సను రద్దుచేసి పాత పెన్షన విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోపాల్‌రెడ్డి, రా ష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మురళీమోహన, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మధుసూదనరెడ్డి, ఆర్థిక కార్యదర్శి శంకరమూర్తి, సహాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నారాయ ణ, కుళ్లాయప్ప, సూర్యనారాయణ, నరేష్, వలి, సుంకన్న, లింగన్న పాల్గొన్నారు.