Share News

TDP: టీడీపీతోనే కళ్యాణదుర్గానికి మహర్దశ

ABN , Publish Date - May 04 , 2024 | 12:22 AM

టీడీపీతోనే కళ్యాణదుర్గానికి మహర్దశ పట్టనుందని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం శెట్టూరు మండల చింతర్లపల్లి, ముచ్చర్లపల్లి, చౌళూరు, కనుకూరు, మల్లేటిపురం, అనుంపల్లి, రంగయ్య పాల్యం, ములకలేడు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సురేంద్రబాబు మాట్లాడుతూ రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారుతాయన్నారు.

TDP: టీడీపీతోనే కళ్యాణదుర్గానికి మహర్దశ
అమిలినేని సురేంద్రబాబును గజమాలతో స్వాగతిస్తున్న గ్రామస్థులు

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని

కళ్యాణదుర్గం, మే 3: టీడీపీతోనే కళ్యాణదుర్గానికి మహర్దశ పట్టనుందని కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు అన్నారు. శుక్రవారం శెట్టూరు మండల చింతర్లపల్లి, ముచ్చర్లపల్లి, చౌళూరు, కనుకూరు, మల్లేటిపురం, అనుంపల్లి, రంగయ్య పాల్యం, ములకలేడు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సురేంద్రబాబు మాట్లాడుతూ రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ రోడ్ల రూపురేఖలు మారుతాయన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామాలన్నీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇప్పుడేమో వైసీపీ మేనిఫెస్టో అంటూ కరపత్రాన్ని పంచుతున్నారన్నారు. అందులో ముఖ్యమంత్రి బొమ్మ, వాళ్ల నాన్న బొమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మలు తప్ప ఏమీ లేవన్నారు. ఇక్కడ మంత్రిగా పనిచేసిన ఉషశ్రీచరణ్‌, ఎంపీ రంగయ్య కనీసం గ్రామాలకు రహదారులు కూడా వేయలేదంటే ఎంత దౌర్భాగ్యస్థితి వుందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం సంక్రాంతి, రంజాన, క్రిస్మస్‌ కానుకలు అందిం చి అందరూ సంతోషంగా పండుగలు జరుపుకోవడం చూశామన్నారు.


ఇప్పుడు అమ్మఒడి అంటూ ఇస్తూ నాన్నబుడ్డితో వెనక్కు లాక్కుంటూ సా మాన్య ప్రజలను అంధకారంలోకి నెట్టేశారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజ ల కోసం వారి అభివృద్ధి కోసం పాటుపడే టీడీపీని ఆదరించాలని కోరారు. చిన్నపాటి ఉద్యోగులైన అంగనవాడీ కార్యకర్తలు ధర్నాలుచేసినా వారి వేతనాలు పెంచలేని వ్యక్తి ఇక ప్రాజెక్టులకు ఎక్కడ నిధులిస్తారని ప్రశ్నించారు. టీ డీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబునాయుడును ఒప్పించి రెండున్నరేళ్లలో బీటీపీ కాలువ, కుందుర్పి బ్రాంచ కెనాల్‌ను పూర్తిచేసి ప్రతి చెరువుకు సాగునీరు తీసుకువస్తామని మామీ ఇచ్చారు. గ్రామీణ రోడ్లకు రూ.200 కోట్ల వరకు అవసరమవుతుందని, కేంద్రం నుంచి కొంత నిధులు తీసుకువచ్చి ఏడాదిలోపు రోడ్లు పూర్తి చేస్తామన్నారు. ప్రజలు చంద్రబాబునాయుడు పాలన కోరుకుంటున్నారని, 13వ తేదీన ప్రతి ఒక్కరు టీడీపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా నియోజకవర్గంలో గెలిచేది టీడీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ముస్లింల అభివృద్ధికి పాటుపడతా

కుందుర్పి: ముస్లిం మైనార్టీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అ మిలినేని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని జా మియా మసీదులో ము స్లింలతో ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ ఎల్లప్పుడూ మైనార్టీలకు అండగా వుంటుందన్నారు. అనంతరం ముస్లింలు వారి సంప్రదాయం ప్రకారం సన్మానం చేశారు. మాజీ కోఆప్షన మెంబర్‌ తాహిర్‌, పార్టీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.


కళ్యాణదుర్గం రూపురేఖల మార్పు సురేంద్రబాబుతోనే సాధ్యం

కళ్యాణదుర్గంరూరల్‌: కళ్యాణదుర్గం నియోజకవర్గ రూపురేఖలు మారాలంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుతోనే సాధ్యమని ఐఎ్‌సఐవి వ్యవస్థాపక అధ్యక్షులు టీపీ రామన్న అన్నారు. శుక్రవారం శెట్టూరులో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేశారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

బ్రహ్మసముద్రం: మండల పరిధిలోని ఎరడికెర గ్రామానికి చెందిన 8వ వార్డు మెంబర్‌ గురుస్వామి, పదవ వార్డు మెంబర్‌ తిమ్మప్ప, వెంకటేశులు మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాషా్ట్రలకు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Updated Date - May 04 , 2024 | 12:22 AM