police station check కసాపురం పోలీస్ స్టేషన తనిఖీ
ABN , Publish Date - Dec 22 , 2024 | 01:03 AM
కసాపురం పోలీస్ స్టేషనను ఎస్పీ జగదీష్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామిదర్శనం చేయించి అర్చనలు జరిపారు.
గుంతకల్లు టౌన, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): కసాపురం పోలీస్ స్టేషనను ఎస్పీ జగదీష్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అర్చకులు ఘన స్వాగతం పలికి స్వామిదర్శనం చేయించి అర్చనలు జరిపారు.
అనంతరం పోలీస్ స్టేషనను తనిఖీ చేసి పరిసరాలను, లాకర్‌గదులు, రికార్డులను పరిశీలించారు. తర్వాత డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి గుంతకల్లు సబ్ డివిజన అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మహిళల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చోరీల నివారణకు చర్యలు తీసుకుని రికవరీలను పెంచాలన్నారు. మట్కా, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పనిచేయాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై నిఘా పెంచాలన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు, శివారు కాలనీల్లో డ్రోన్లు ఎగురవేసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్టుకట్ట చేయాలని సూచించారు. డీఎస్పీ ఏ శ్రీనివాస్, ఎస్పీ సీసీ ఆంజనేయప్రసాద్, సబ్ డివిజన సీఐలు మనోహర్, మస్తాన, ప్రవీణ్‌కుమార్, చిన్నగౌస్, మహానంది, రాజు, వెంకటేశ్వర్లు, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..