Share News

Kharif : ప్చ్‌.. ముంగారు!

ABN , Publish Date - Aug 10 , 2024 | 12:03 AM

తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌ సాగు నిరాశజనకంగా ఉంది. జిల్లా సరాసరి సాధారణ సాగు విస్తీర్ణం 3.46 లక్షల హెక్టార్లు కాగా... ఇప్పటి దాకా 1.43 లక్షల హెక్టార్లలో మాత్రమే వివిధ రకాల పంటలు సాగయ్యాయి. మిగిలిన 2.03 లక్షల హెక్టార్ల పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ప్రకృతి సహకరిస్తుందన్న ఆశతో తాజాగా 40 వేల హెక్టార్లలో రైతులు కంది విత్తుకోవడంతో ఆమాత్రం సాగువిస్తీర్ణమైనా కనిపిస్తోంది. రెండు వారాల కిందట 80 వేల హెక్టార్లలో మాత్రమే విత్తనం పడింది. ఆ తరువాత కందితోపాటు వేరుశనగ, ఇతర పంటలను కొంతమేర సాగు చేశారు. దీంతో 1.43 లక్షల హెక్టార్లకు చేరిందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ...

Kharif : ప్చ్‌.. ముంగారు!
Paddy field in Yadiki

ఖరీఫ్‌ను వెంటాడుతున్న వర్షాభావం

ప్రధాన పంట వేరుశనగకు దాటిన అదును

జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 3.46 లక్షల హెక్టార్లు

ఇప్పటి దాకా 1.43 లక్షల హెక్టార్లలోనే పంటల సాగు

బీడు పడిన 2.03 లక్షల హెక్టార్ల పొలాలు

ప్రత్యామ్నాయ పంటలకైనా పదును వాన పడేనా..?

తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌ సాగు నిరాశజనకంగా ఉంది. జిల్లా సరాసరి సాధారణ సాగు విస్తీర్ణం 3.46 లక్షల హెక్టార్లు కాగా... ఇప్పటి దాకా 1.43 లక్షల హెక్టార్లలో మాత్రమే వివిధ రకాల పంటలు సాగయ్యాయి. మిగిలిన 2.03 లక్షల హెక్టార్ల పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ప్రకృతి సహకరిస్తుందన్న ఆశతో తాజాగా 40 వేల హెక్టార్లలో రైతులు కంది విత్తుకోవడంతో ఆమాత్రం సాగువిస్తీర్ణమైనా కనిపిస్తోంది. రెండు వారాల కిందట 80 వేల హెక్టార్లలో మాత్రమే విత్తనం పడింది. ఆ తరువాత కందితోపాటు వేరుశనగ, ఇతర పంటలను కొంతమేర సాగు చేశారు. దీంతో 1.43 లక్షల హెక్టార్లకు చేరిందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు.

- అనంతపురం అర్బన/యాడికి


వేరుశనగ లేనట్లే..

ప్రతి ఏటా జూన 15 నుంచి ఆగస్టు 5 వరకు వేరుశనగ విత్తడానికి అదును సమయమని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. ఈ ప్రకారం ఈ నెల 5వ తేదీకే వేరుశనగ సాగుకు అదును దాటిపోయింది. ఇప్పుడు వర్షా లు పడినా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాల్సిందే. వేరుశనగ సాగు చేస్తే దిగుబడులు రావని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

చినుకు రాలలేదు..

ఈ సంవత్సరం ఖరీ్‌ఫను వర్షాభావం వెంటాడింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ముం దస్తుగానే జూన 2న జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అయినా ఆశించిన స్థాయిలో ప్రయోజనం లేకపోయింది. జూన సరాసరి సాధారణ వర్షపాతం 61.0 మి.మీ. కాగా గత సంవత్సరం జూనలో 45.8 మి.మీ. నమోదైంది. ఈ ఏడాది 147.7 మి.మీ. నమోదైంది. అయితే జూలై సరాసరి సాధారణ వర్షపాతం 63.9 మి.మీ. కాగా గత ఏడాది జూలై లో 73.3 మి.మీ. నమోదైంది. ఈ ఏడాది 24.4 మి.మీ. మాత్రం నమోదైంది. ఆగస్టు సాధారణ వర్షపాతం 83.8 మి.మీ. కాగా ఇప్పటి దాకా 7.3 మి.మీ. నమోదైంది. ఈ ఏడాది జూనలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదైనా.. పంటలను సాగు చేయలేకపోయారు. మే నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో జూన నెల అంతా దుక్కులు దున్ని సేద్యం పనులు చేసుకునేందుకే సరిపోయింది. కొన్ని రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉన్నా.. పదును వర్షాలు లేవు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలకే పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ సాగుకైనా అవకాశం ఉంటుందా అని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

1.43 లక్షల హెక్టార్లల్లో పంటల సాగు

జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 3.46 లక్షల హెక్టార్లు. ఇందులో వేరుశనగ 1.97 లక్షల హెక్టార్లు ఉంటుందని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటి దాకా అన్ని పంటలు కలిపి 1.43 లక్షల హెక్టార్లల్లోనే సాగయ్యాయి. ఇందులో వేరుశనగ 53 వేల హెక్టార్లు, కంది 40 వేలు, పత్తి 21వేలు, ఆముదం 12 వేలు, మొక్కజొన్న 7,580, సజ్జ 2,149, కొర్ర 2,645 హెక్టార్లల్లో సాగయ్యాయి. మిగతా విస్తీర్ణంలో జొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్స, పెసలు, మినుములు తదితర పంటలను సాగుచేశారు. జిల్లా వ్యాప్తం గా ఇంకా 2.03 లక్షల హెక్టార్లల్లో పంటలు సాగు చేయాల్సి ఉంది. వర్షాభావంతో ఆయా పొలాలను బీడు పెట్టాల్సి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది ఖరీ్‌ఫలో ఇదే సమయానికి 2.05 లక్షల హెక్టార్లల్లో వివిధ పంటలు సాగయ్యాయి.

అరకొర పదునుకే..

ఈ సారి అరొకర పదునుకే మూడెకరాల్లో వేరుశనగ సాగు చేశాను. వర్షాభావంతో పంట ఎదుగుదల లేదు. విత్తనం వేసిన తర్వాత సరిపడా వర్షం కురిసి ఉంటే మంచి దిగుబడి వచ్చేది. గతేడాది మాదిరిగానే ఈ సారి వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్నాం. వర్షాలు సరిగా పడకపోవడంతో దిగుబడిపై అనుమానంగానే ఉంది.

- చంద్రశేఖర్‌, కత్తి మానుపల్లి, యాడికి మండలం

అదును దాటిపోయింది..

ఈ ఏడాది ఖరీ్‌ఫలో వేరుశనగ సాగుకు అదును సమయం ఇప్పటికే దాటిపోయింది. ఈ సారి ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో పంటల సాగువిస్తీర్ణం తగ్గింది. ఇప్పుడు వేరుశనగ విత్తుకున్నా దిగుబడి రాదు. జొన్న, కొర్ర, పెసర, అలసంద, ఉలవ, మినుము తదితర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుంటే ఫలితం ఉంటుంది. రైతులు ఆ దిశగా ఆలోచించాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలి.

- డాక్టర్‌ చండ్రాయుడు, ప్రధాన శాస్త్రవేత్త, కళ్యాణదుర్గం కేవీకే

వేరుశనగ వేయలేకపోయా..

ఈ సారి వర్షాలు సరిగా పడకపోవడంతో వేరుశనగ సాగు చేయలేకపోయాను. ఖరీఫ్‌ సీజన ఆరంభమైన తర్వాత కురిసిన వర్షాలకు పొలంలో సేద్యం పనులు చేసుకున్నాను. ఆ తర్వాత పదును వర్షం పడకపోవడంతో వేరుశనగ విత్తలేకపోయాను. అందుకే ఆలస్యంగా కంది పంట వేశాను. కంది విత్తిన తర్వాత ఆశించినస్థాయిలో వానలు పడకపోవడంతో ఎదుగుదల కనిపించడం లేదు. దిగుబడి వస్తుందో రాదో అర్థం కావడం లేదు.

- శేఖర్‌రెడ్డి, యాడికి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 10 , 2024 | 12:03 AM