Share News

tdp: అవినీతి వైసీపీని తరిమికొట్టండి

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:10 AM

నంబులపూలకుంట, ఏప్రిల్‌ 26: గ డిచిన ఐదేళ్లలో అవినీతి పాలన సాగించి న వైసీపీని ప్రజలు ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని టీడీపీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పిలుపునిచ్చారు. మండలంలోని సోమరాజకుంట, కుంట్లప ల్లి, కోటిరెడ్డివారిపల్లి, ధనియానిచెరువు, హరిజనవాడ, పాతూరు, గోవిందరాజులపల్లి, బి.కొత్తపల్లి, వంకమద్ది, పోరెడ్డివారిపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఆ యనకు ప్రజలు ఘన స్వాగతం పలికా రు. మహిళలు హారతులు పట్టారు. త ర్వాత ఆయన ఇంటింటికీ వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే తనను, ఎంపీగా బీకే పార్థ సారధని గెలిపించాలని కోరారు.

tdp: అవినీతి వైసీపీని తరిమికొట్టండి
సోమరాజుకుంటలో కందికుంటకు ఘన స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు

-ఎన్నికల ప్రచారంలో కందికుంట వెంకటప్రసాద్‌ పిలుపు

నంబులపూలకుంట, ఏప్రిల్‌ 26: గ డిచిన ఐదేళ్లలో అవినీతి పాలన సాగించి న వైసీపీని ప్రజలు ఈ ఎన్నికల్లో తరిమి కొట్టాలని టీడీపీ కూటమి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్‌ పిలుపునిచ్చారు. మండలంలోని సోమరాజకుంట, కుంట్లప ల్లి, కోటిరెడ్డివారిపల్లి, ధనియానిచెరువు, హరిజనవాడ, పాతూరు, గోవిందరాజులపల్లి, బి.కొత్తపల్లి, వంకమద్ది, పోరెడ్డివారిపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఆ యనకు ప్రజలు ఘన స్వాగతం పలికా రు. మహిళలు హారతులు పట్టారు. త ర్వాత ఆయన ఇంటింటికీ వెళ్లి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే తనను, ఎంపీగా బీకే పార్థ సారధని గెలిపించాలని కోరారు.

సూపర్‌ సిక్స్‌ పథకాల గు రించి వివరించి.. చంద్రబాబు సీఎం కాగానే వాటిని అ మలు చేస్తారని తెలిపారు. ధనియానిచెరువులో ప్రచారం ముగించుకుని విలేకరులతో మాట్లాడారు. ఏ గ్రామంలో చూసినా తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. తాగునీటి కోసం ప్రజలు పడుతున్న పాట్లు వర్ణణాతీతంగా ఉన్నాయన్నారు. ప్రజలు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ పొలా ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందని మండిపడ్డారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని అన్నారు. అవినీతి వైసీపీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు ప్రస్తుత వైసీపీ అభ్యర్థికి ఈ నియోజకవర్గ సమస్యలపై కొంచెం కూడా అవగాహన లేదన్నారు. నియోజకవర్గంలో హిం దూ ముస్లింలు సమైక్య భావంతో జీవిస్తున్నారన్నారు. అయితే కొందరు అశాంతిని నెలకొల్పే పరిస్థితులు తీసుకురావాలని చూస్తున్నారన్నారు. అలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చంద్రశేఖర్‌ నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం...

Updated Date - Apr 27 , 2024 | 01:10 AM