Share News

క్లీన అనంత హుళక్కేనా..?

ABN , Publish Date - May 18 , 2024 | 12:21 AM

ఏ సభ జరిగినా.. ఏ సమావేశం జరిగినా క్లీన అనంత.. గ్రీన అనంతే లక్ష్యమని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ప్రసంగాలతో ఊదరగొట్టారు. అయితే చేసింది మాత్రం శూన్యం. నగర నడిబొడ్డున ఉన్న ప్రధాన కాలువ చెత్తా చెదారంతో నిండి... పిచ్చి మొక్కలు పెరిగి.. మురుగునీరు నిల్వ ఉండి.. నిత్యం కంపు కొడుతోంది.

క్లీన అనంత హుళక్కేనా..?
సోమనాథ్‌నగర్‌ వద్ద కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, మే 17: ఏ సభ జరిగినా.. ఏ సమావేశం జరిగినా క్లీన అనంత.. గ్రీన అనంతే లక్ష్యమని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ప్రసంగాలతో ఊదరగొట్టారు. అయితే చేసింది మాత్రం శూన్యం. నగర నడిబొడ్డున ఉన్న ప్రధాన కాలువ చెత్తా చెదారంతో నిండి... పిచ్చి మొక్కలు పెరిగి.. మురుగునీరు నిల్వ ఉండి.. నిత్యం కంపు కొడుతోంది. ప్రధాన మురుగు కాలువ దుస్థితే ఇలా ఉంటే.. ఇక మిగిలిన వాటి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. శుభ్రం చేయాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. చెత్తాచెదారం, వ్యర్థాలతో అవి స్తంభించిపోయాయి.


అటువైపు వెళ్లే వారు భరించలేని కంపుతో ముక్కుమూసుకొని వెళ్లాల్సిన దుస్థితి ఉంది. ఆ కాలువ ప్రయాణించే కాలనీల్లో సైతం కాలువ నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో వ్యర్థాలు అడ్డుపడి మురుగునీరంతా రోడ్డుపైకి వస్తోంది. ఇక వర్షాలు వస్తే ఆ మురుగునీరంతా ఇళ్లలోకే.. రెండేళ్ల కిత్రం కురిసిన భారీ వర్షాలకు ప్రధాన కాలువల సమీపంలోని ప్రాంతాలన్ని జలయమైన విషయం తెల్సిందే. అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. తీవ్రంగా నష్టపోయారు. ఆ తర్వాత అయినా పాలకులు, అధికారులు ప్రధాన మురుగు కాలువలను శుభ్రం చేసేలా చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం.

Updated Date - May 18 , 2024 | 12:21 AM