Share News

AP FORMERS ASSOCIATION: కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీ చేయాలి

ABN , Publish Date - Aug 05 , 2024 | 11:37 PM

కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీ జరగాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆ సంఘం నాయకులు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు.

AP FORMERS ASSOCIATION: కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీ చేయాలి
Mallikarjuna speaking

అనంతపురం విద్య, ఆగస్టు 5: కృష్ణా, గోదావరి జలాల పునఃపంపిణీ జరగాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆ సంఘం నాయకులు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ ఏపీ విభజన చట్టం, గత ట్రిబ్యునల్‌ ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణలో నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజక్టుల వల్ల ఏపీకి జరిగే నష్టాలను ట్రిబ్యునల్‌ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీశైలం దిగువన సాగర్‌ ఎడమ కాలువ నుంచి తెలంగాణకు 99 టీఎంసీలు, ఏపీకి 33 టీఎంసీల నీటిని వినియోగించుకోవాల్సి ఉన్నప్పటికీ మన రాషా్ట్రనికి రావాల్సిన 33 టీఎంసీలు రాకపోవడం వల్ల 3, 4 జోన్లలో నీరు అందని దుర్భర పరిస్థితులు ఏర్పాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నీటి పంపిణీపై చర్చించేందుకు ఉభయ రాషా్ట్రల మధ్య ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటుచేయాలని కోరారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని పలు అంశాలపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నాయకులు, నీటి రంగ నిపుణులతో సమావేశం నిర్వహించాలని కోరారు. రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామకృష్ణ, నారాయణస్వామి, చలపతి, రమేష్‌, నరేష్‌ పాల్గొన్నారు. అలాగే అమూల్‌ పాల రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. బాధిత రైతులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. మల్లికార్జున మాట్లాడుతూ 10వ తేదీ నుంచి సంఘాల నుంచి అమూల్‌ పాల సేకరణను నిలుపుదల చేస్తున్నట్లు సంస్థ వారుచెప్పారన్నారు. మహిళా సంఘాలు రైతులకు ఎలాంటి ప్రత్యామ్నాయం చెప్పకుండా ఇలా చేయడం సరికాదన్నారు. కొర్రపాడు సర్పంచ శ్రీనివాసరెడ్డి నాగరాజు, ఆలమూరు మాధవి, శ్రీధర్‌రెడ్డి, శివలింగ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 11:37 PM