Share News

KRISHNASHTAMI : కృష్ణం... వందే జగద్గురుమ్‌..!

ABN , Publish Date - Aug 27 , 2024 | 12:00 AM

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల వ్యాప్తంగా సోమవారం కన్నుల పండువగా నిర్వ హించారు. ఆలయాల్లో తెల్లవారు జాము నుంచే అభిషేకాలు, అర్చన లు, అలంకరణ తదితర ప్రత్యేక పూ జలు చేశారు. పలు చోట్ల స్వామి కల్యాణోత్సవాలను నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమా లు చేపట్టారు.

KRISHNASHTAMI : కృష్ణం... వందే జగద్గురుమ్‌..!
Women carrying torches in Madakasira

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌ నెట్‌వర్క్‌)

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను హిందూపురం, పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల వ్యాప్తంగా సోమవారం కన్నుల పండువగా నిర్వ హించారు. ఆలయాల్లో తెల్లవారు జాము నుంచే అభిషేకాలు, అర్చన లు, అలంకరణ తదితర ప్రత్యేక పూ జలు చేశారు. పలు చోట్ల స్వామి కల్యాణోత్సవాలను నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమా లు చేపట్టారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చిన్నారులు శ్రీ కృష్ణుడు, గోపికల వేషధారణలతో అ లరించారు. ఉట్టికొట్టే కార్యక్రమాలు నిర్వహించారు. హిందూపురంలోని వాసవీ ధర్మశాలలో ఇస్కాన ఆధ్వ ర్యంలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. శ్రీకృష్ణ జన్మస్థానం మధుర నుంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. గోరంట్ల లోని పురాతన మాధవరాయ దేవాల యంలో కృష్ణాష్టమి వేడుకలకు జడ్పీ మాజీ ఛైర్మన చమన సాబ్‌ తన యుడు డాక్టర్‌ ఉమ్మర్‌ ముక్తార్‌, వీ హెచపీ నాయకుడు వేదవ్యాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 27 , 2024 | 12:00 AM