KRISHNASTAMI : భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు
ABN , Publish Date - Aug 28 , 2024 | 12:17 AM
మండలంలోని కొట్టాలపల్లి వెలసిన రాధాకృష్ణ ఆలయంలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణుల మూలవిరాట్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు. గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త శ్రీనివాసయాదవ్, కమిటీ సభ్యులు గంగరాజు, రఘురాములు, రంగారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రాజా, రామాంజనేయులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
యాడికి, ఆగస్టు27: మండలంలోని కొట్టాలపల్లి వెలసిన రాధాకృష్ణ ఆలయంలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణుల మూలవిరాట్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు. గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్త శ్రీనివాసయాదవ్, కమిటీ సభ్యులు గంగరాజు, రఘురాములు, రంగారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రాజా, రామాంజనేయులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడు, మాజీ ఎంపీపీ వేలూరు రంగ య్య, నాయకులు రామచంద్రారెడ్డి, ఆదినారాయణ, తాండ్ర విక్రమ్, నరసింహచౌదరి తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు.
గుత్తి/గుత్తిరూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులోని శ్రీకృష్ణ మందిరం వద్ద మంగళవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వే డుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక రథంలో శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్ర హాన్ని కొలువు దీర్చి స్ధానిక మన్రోసత్రం వద్ద నుంచి ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే గుమ్మ నూరు జయరాం, టీడీపీ గుత్తి ఇన్చార్జి గుమ్మనూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్ స్వామిని దర్శించుకుని పూజలు చేయించారు. కొత్తపేట శ్రీకృష్ణమం దిరం వరకు ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు, న్యాయవాది సోమశేఖర్, టీడీపీ నాయకులు సంపతకుమార్, ఎంకేచౌదరి, చికెన శ్రీనివాసులు, చెట్నేపల్లిరమేష్ తదితరులు పాల్గొన్నారు.
గుంతకల్లుటౌన: పట్టణంలోని కొనకొండ్ల రోడ్డులోని వివేకానంద పాఠశా లలో మంగళవారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృ ష్ణ, గోపికల వేషధారణలో విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలహెచఎం నాగ మణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ గురుదాస్, సీఈ ఓ శ్రీనివాసులు, ప్రీప్రైమరీ ఇన్చార్జి సరోజమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విడపనకల్లు : మండలంలోని వీ కొత్తకోట, గడేకల్లు గ్రామాల్లో కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి ఊరేగింపును ఘనంగా నిర్వహిం చారు. వీ కొత్తకోటలో మహిళలు హారతులతో, చిన్నారులు శ్రీకృష్ణు డు, గోపికల వేషధారణ లో పాల్గొన్నారు. గ్రామ నడిబొడ్డున ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....