Share News

SAND: ఇసుకపై అధికార పార్టీ నాయకుల పెత్తనం

ABN , Publish Date - Oct 05 , 2024 | 12:08 AM

సీఎం చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నా కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులు ఇసుకపై పెత్తనం చేస్తున్నారని సీపీఎం న్యూటౌన కమిటీ కార్యదర్శి ఆర్‌వీ నాయుడు, రూరల్‌ కార్యదర్శి రామాంజనేయులు విమర్శించారు.

SAND: ఇసుకపై అధికార పార్టీ నాయకుల పెత్తనం
CPM leaders giving the petition to the officer

అనంతపురంరూరల్‌, అక్టోబరు 4: సీఎం చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నా కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులు ఇసుకపై పెత్తనం చేస్తున్నారని సీపీఎం న్యూటౌన కమిటీ కార్యదర్శి ఆర్‌వీ నాయుడు, రూరల్‌ కార్యదర్శి రామాంజనేయులు విమర్శించారు. శుక్రవారం సీపీఎం అనంతపురం న్యూటౌన, రూరల్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతితో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పాడిందన్నారు. ఈసమస్య రాజకీయ సమస్యగా మారి అధికార మార్పిడిలో కీలకమైందన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. వందరోజుల పాలనలో ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందన్నారు. అనేక చోట్ల ఇసుక లభించడం లేదన్నారు. ఇసుక కొరత, అధిక రేట్లతో భవన నిర్మాణరంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. నాయకులు ముర్తుజా, ఇర్ఫాన, ఆజాం, బైపరెడ్డి, గౌస్‌, రంగా, ప్రసాదు, అక్బర్‌, బాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2024 | 12:08 AM