Share News

KADIRI JUGDGE : మహిళా జాగృతికే న్యాయ సదస్సులు

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:47 PM

మహిళలు మోసపోకుండా జాగృతం చేసేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించనున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన, న్యాయాధికారి జయలక్ష్మి తెలిపారు.

KADIRI JUGDGE : మహిళా జాగృతికే న్యాయ సదస్సులు
Justice Jayalakshmi is speaking

కదిరి లీగల్‌, నవంబరు2(ఆంధ్రజ్యోతి): మహిళలు మోసపోకుండా జాగృతం చేసేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులను నిర్వహించనున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన, న్యాయాధికారి జయలక్ష్మి తెలిపారు. అక్టోబరు 5న ఈ ప్రక్రియ నల్లమడలో ప్రారంభమైనట్లు చెప్పారు. అందులో భాగంగా 16, 23వ తేదీల్లో తలుపుల, కదిరిరూరల్‌ మండలాల్లో సదస్సులను నిర్వహిస్తామన్నారు. ఉన్నత న్యాయస్థానం, హైకోర్టు, జిల్లా కోర్టుల ఆదేశాల మేరకు సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈమేరకు శనివారం సమావేశాన్ని ఆమె అధ్యక్షతన నిర్వహించారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారి ఎం రాధిక, రెడ్స్‌ సంస్థ అఽధ్యక్షురాలు సీ భానుజా, న్యాయవాదులు లోకేశ్వర్‌రెడ్డి, గురులింగస్వామి పాల్గొన్నారు. విధాన్సే సమాధాన ద్వారా మహిళా చైతన్య సదస్సుల ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. మిగిలిన మండలాల్లో కూడా మార్చి 31వ తేదీలోగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రత్యేకించి గృహహింస, వరకట్న వేధింపులు మహిళల అపహరణ, అక్రమ రవాణా, యాసిడ్‌దాడులు, మానభంగాలు, సమానపనికి సమాన వేతనం, ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న అంశాలపై కూడా సదస్సులలో చర్చిస్తామన్నారు. మహిళలు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే న్యాయ విజ్ఞాన సదస్సుల ఆవశ్యకత అన్నారు. ప్రధానంగా మహిళల చట్టాలను వివరించి మేల్కొల్పడం ఇందులో భాగమేనన్నారు. మహిళ చైతన్యవంతురాలు అయినప్పుడే కుటుంబం, సమాజం సౌభాగ్యవంతంగా ఉంటుందన్నారు. ఎంతో ఉన్నత ఆశయాలతో సాగే సదస్సులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Updated Date - Nov 02 , 2024 | 11:47 PM