TDP: విష సంస్కృతిని విడనాడాలి
ABN , Publish Date - Jun 21 , 2024 | 11:56 PM
నియోజకవర్గంలో విష సంస్కృతిని విడనాడాలని టీడీపీ ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. శుక్రవారం అమరాపురం మండలం గొల్లమారనపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త మంజునాథ్ అనే రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు పత్తి మొక్కలను పెరికి వేశారు. ఎకరా పొలంలో క్రాస్ పత్తి మొక్కలను పెరికి వేశారని, రూ.6లక్షల వరకు న ష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మడకశిరటౌన, జూన 21: నియోజకవర్గంలో విష సంస్కృతిని విడనాడాలని టీడీపీ ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. శుక్రవారం అమరాపురం మండలం గొల్లమారనపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త మంజునాథ్ అనే రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు పత్తి మొక్కలను పెరికి వేశారు. ఎకరా పొలంలో క్రాస్ పత్తి మొక్కలను పెరికి వేశారని, రూ.6లక్షల వరకు న ష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకొన్న తిప్పేస్వామి పంట పొలానికి వెళ్లి పరిశీలించి రైతుకు ధైర్యం చెప్పారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని ఎస్ఐ జనార్ధన నాయుడుకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎకరా పొలంలో పూర్తిగా మొక్కలను తొలగించారని, దీనిపై దర్యాప్తుచేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జయకుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు గణేష్, మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి, నాయకులు శివరుద్రప్ప, విశ్వనాథ్, రామచంద్రప్ప పాల్గొన్నారు.