Municipal Chairman JCPR ఊరి బాగు కోసం పాటు పడదాం
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:58 AM
ఊరు బాగు కోసం అందరం పాటు పడదామని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఊరు బాగుండాలంటే చెత్తాచెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండాలని సూచించారు.
మున్సిపల్ చైర్మన జేసీపీఆర్
తాడిపత్రి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఊరు బాగు కోసం అందరం పాటు పడదామని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఊరు బాగుండాలంటే చెత్తాచెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండాలని సూచించారు.
చెత్త ఎక్కడబడితే అక్కడ పడేస్తే.. వాటివల్ల ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులు పడతారని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పినా ఎవరూ అర్థం చేసుకోవడం లేదని, అదే తనను బాధిస్తోందని వాపోయారు. జనవరి నుంచి చెత్త అలాగే పడేస్తే మొదటి ఆప్షన కొళాయి కట్‌చేయడం, రెండో ఆప్షన కరెంట్ కట్‌చేయడం, మూడో ఆప్షన ఫైన వేయడం, నాలుగో ఆప్షన చెత్త ను మీ ఇంటిలోనే వేయడం, ఇవన్నీ కాదంటే తనను ఊరు విడిపించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఎక్కడబడితే అక్కడ వాహనాలను అడ్డగోలుగా నిలుపుతున్నారని, బీటెక్ చదివిన వారు కూడా అలాగే చేస్తున్నారంటే అర్థం లేకుండా పోతోందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చదువుకన్నా ముందుగా క్రమశిక్షణ నేర్పించాలని హితవు పలికారు. డిగ్రీ, ఇంజనీరింగ్ చదివిన మహిళలకు పట్టణంలోని వద్ది షోరూం ఎదురుగా ఉన్న స్థలంలో స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఎవరైనా తీసుకొని బాడుగలకు ఇస్తే ఒప్పుకోమని అన్నారు. కేవలం మహిళలు ఆర్థికంగా అభివృద్ధిచెందడానికే ఈ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జేసీ పార్కు సమీపంలో కూడా స్టాల్స్ ఏర్పాటుకు కృషిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...