Share News

Independence Day : జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం

ABN , Publish Date - Aug 16 , 2024 | 12:44 AM

అన్నిరంగాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పిలుపునిచ్చారు. అనంత జిల్లా కేంద్రంలోని పోలీ్‌స పరేడ్‌ మైదానంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాలు అట్టహాసంగా కొనసాగాయి. మంత్రి పయ్యావుల కేశవ్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్య్రం వచ్చిందని, అలాంటి మహనీయుల స్ఫూర్తితో దేశాభివృద్ధికోసం ముందుకు సాగుదామని తెలిపారు. దేశస్వాతంత్య్రం కోసం ...

Independence Day : జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదాం
State Finance Minister Payyavula Keshav, Collector Vinod Kumar, SP Muralikrishna were on the stage.

మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం

ప్రజాకాంక్షలకు అనుగుణంగా పాలన

అభివృద్ధి జరిగితేనే ఆదాయం పెరుగుదల

జవాబుదారీతనంతో కష్టపడి పనిచేద్దాం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పిలుపు

అట్టహాసంగా స్వాతంత్య్ర వేడుకలు

అనంతపురం టౌన, ఆగస్టు 15 : అన్నిరంగాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుదామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ పిలుపునిచ్చారు. అనంత జిల్లా కేంద్రంలోని పోలీ్‌స పరేడ్‌ మైదానంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాలు అట్టహాసంగా కొనసాగాయి. మంత్రి పయ్యావుల కేశవ్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే మనకు స్వాతంత్య్రం వచ్చిందని, అలాంటి మహనీయుల స్ఫూర్తితో దేశాభివృద్ధికోసం ముందుకు సాగుదామని తెలిపారు. దేశస్వాతంత్య్రం కోసం పోరాటాలు సాగించి ప్రాణాలు అర్పించిన మహనీయులందరికీ వందనాలు తెలియజేస్తున్నామని అన్నారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభా్‌షచంద్రబోస్‌, లాలాలజపతిరాయ్‌, భగతసింగ్‌, చంద్రశేఖర్‌అజాద్‌ వంటి సమరయోధులు


స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడి ప్రాణాలు అర్పించారన్నారు. అలాంటి ఉద్యమంలో అనంత జిల్లా నుంచి పప్పూరు రామాచార్యులు, కైప సుబ్రమణ్యశర్మ, గుత్తికేశవపిళ్లై, ఐదుకల్లు సదాశివన, గుత్తి రామక్రిష్ణ, పెద్దగొంది కొండప్ప, జీవరత్నమ్మ, ఆదిశేషయ్య, హంపన్నలాంటి వారు ఎందరో పాల్గొనడం మన అందరి అదృష్టమన్నారు. అలాంటి మహనీయుల స్ఫూర్తితో మరింత జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజాకాంక్షలకు అనుగుణంగా పాలన

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కేశవ్‌ పేర్కొన్నారు. మంచిపాలన అంటే సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు వినూత్న ఆలోచనలు చేయాలని కోరారు. మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకుసాగితే భవిష్యత తరాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. గత పాలకుల చేతుల్లో రాష్ట్రం ఎంతో దెబ్బతినిందని, దీనిని పునర్నిర్మించాలనే టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ నేపథ్యంలో అందరం జవాబుదారీతనంతో లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అభివృద్ధి జరిగితేనే ఆదాయ వనరులు పెరుగుతాయని, అందుకే ఓవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి సాగిస్తూ ప్రజలు మెచ్చే విధంగా పాలన అందిద్దామని తెలిపారు. మానవతా దృష్టితో ఆలోచిస్తే సమస్యలను పరిష్కరించవచ్చునని, కష్టపడి పనిచేస్తే 2047నాటికి ప్రపంచంలోనే మనం నెంబర్‌వనగా ఉంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్నికల హామీల అమలుకు పెద్దపీట

రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ సాగుతోందని మంత్రి కేశవ్‌ చెప్పుకొచ్చారు. అధికారం చేపట్టిన తొలిరోజే మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, ఎన్టీఆర్‌భరోసా పింఛన్లపెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, యువతకు నైపుణ్యగణన ఫైళ్లపై సీఎం చంద్రబాబునాయుడు సంతకాలు చేశారని గుర్తుచేశారు. ఆ మేరకు తొలినెల నుంచే పెంచిన పింఛన్లు రూ.3వేల నుంచి 4వేలు, వికలాంగులకు రూ.3వేల నుంచి రూ.6వేలకు, పూర్తీ నడవలేక మంచానికే పరిమితమైనవారికి రూ.5వేల నుంచి రూ.15వేలు పెంచి ఇచ్చామని తెలిపారు. మాట ప్రకారం మూడునెలల అదనపు సొమ్ము కలిపి ఇచ్చామని చెప్పారు. అనంత జిల్లాలోనే ప్రతినెలా 2,87,656 మంది పింఛనదారులకు రూ.126 కోట్లు అందిస్తున్నామని అన్నారు. పాత ఇసుక విధానాన్ని రద్దుచేసి ఉచితంగా సరఫరా చేస్తున్నామని వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొదుపు సంఘాలకు రూ.224 కోట్లు రుణాలు మంజూరు చేశామన్నారు. చంద్రన్నబీమా పథకం కింద జిల్లాలో 5,93,415 కుటుంబాలను నమోదు చేశామన్నారు. అంగనవాడీల ద్వారా 1,78,958 మందికి పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ ద్వారా కార్డులో పేరున్న ప్రతిఒక్కరి ఆరోగ్యం కోసం రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు చదువుతుంటే అందరికి ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున అందిస్తామన్నారు.

అన్నదాతలకు అండగా..

అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కేశవ్‌ అభయమిచ్చారు. పీఎంకిసాన పథకం కింద జిల్లాలో 2024-25కు గాను తొలివిడతలో 2.77లక్షల రైతు కుటుంబాలకు రూ.555 కోట్లు వారి ఖాతాల్లోకి జమచేశామని తెలిపారు. జిల్లాలో 451 రైతు సేవాకేంద్రాల ద్వారా 4,774 మెట్రిక్‌ టన్నుల ఎరువులను రైతులకు అందించామన్నారు. ఈ ఖరీ్‌ఫ పంట కాలంలో 86,304 మంది రైతులకు 76,137క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలను రూ.28.90 కోట్ల సబ్సిడీతో అందించామని అన్నారు. వంద శాతం డ్రిప్పు వాడుతున్న జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ ఏడాది 37,500 హెక్టార్లకు సూక్ష్మ నీటి పరికరాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆయిల్‌పామ్‌ తోటల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వంద చిన్నతరహా నీటిపారుదల చెరువుల్లో చేపలపెంపకం, పశువుల ఉత్పత్తి కోసం 70 శాతం రాయితీతో పాడిపశువుల షెడ్డులు ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. బోరుబావులకు తొమ్మిది గంటల విద్యుత సరఫరా, హంద్రీనీవా నీటిద్వారా చెరువులు నింపడం, పీఏబీఆర్‌, ఎంపీఆర్‌, చాగల్లు రిజర్వాయర్లను నింపి చివరి ఆయకట్టు వరకు సాగు, తాగునీటిని అందిస్తామని తెలిపారు. నిరుపేదలకు ఇళ్లు, పంచాయతీల అభివృద్ధి, రహదారుల నిర్మాణాలు, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించి పరిశ్రమలు స్థాపనకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. విజన అనంతపురం కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి 2047నాటికి జిల్లాను అన్నిరంగాల్లోనూ అగ్రస్థానంలో నిలపడానికి చిత్తశుద్ధితో పనిచేద్దామని అధికారులు, జిల్లా ప్రజలకు కేశవ్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎస్పీ మురళీక్రిష్ణ, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, నగరప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఉత్సాహంగా వేడుకలు

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 15 : దేశభక్తి గీతాలు... జాతి ఔన్నత్యాన్ని తెలియజేసే సాంస్కృతిక కార్యక్రమాలతో 78వ స్వాతంత్య్ర దినోత్సవాలు గురువారం స్థానిక పోలీస్‌ పరేడ్‌ మైదానంలో అందరినీ అలరించాయి. ప్రఽధానంగా పోలీసు జాగిలాలు, అగ్నిమాపక శాఖ వారి విన్యాసాలు వీక్షకులను కట్టిపడేశాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ఆర్థిక, వాణి జ్య పన్నులు, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్‌ ప్రదర్శన ఆకట్టుకున్నాయి. శకటాల ప్రదర్శనలో వ్యవసాయశాఖ శకటం ప్రథమ స్థానం, వైద్య ఆరోగ్యశాఖ ద్వితీయ, హౌసింగ్‌ శాఖ తృతీయస్థానంలో నిలిచాయి. అదేవిధంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌ ద్వారా ఆయా శాఖల సేవలను ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆత్మకూరు కేజీబీవీ, గొల్లపల్లి మాంటిస్సోరీ పాఠశాలల విద్యార్థులు ప్రఽథమస్థానం, కూడేరు కేజీబీవీ విద్యార్థులు ద్వితీయస్థానం, అనంతపురం కేఎ్‌సఆర్‌ పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానం గెలుపొందారు. పరేడ్‌ విభాగంలో స్పెషల్‌ పార్టీ పోలీసులు ప్రథమ, గురుకులం బాలికల బృందం ద్వితీయ, ఏఆర్‌ కంటిజెంట్స్‌ తృతీయస్థానాల్లో నిలిచా రు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్‌, జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, ఎస్పీ మురళీకృష్ణ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రసంగించారు. స్టాల్స్‌ను సందర్శించారు. స్టాల్స్‌ ప్రదర్శనలో మొదటిస్థానంలో ఐసీడీఎస్‌, ద్వితీయ స్థానంలో మత్స్యశాఖ, తృతీయస్థానంలో ఏపీఎంఐపీ గె లుపొందగా, ఆయా శాఖల జిల్లా అధికారులకు జ్ఞాపికలు అందజేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 16 , 2024 | 12:44 AM