MEGA LOKADALAT: మెగా లోక్అదాలతను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Jun 22 , 2024 | 12:01 AM
కోర్టు, పోలీసుల సమన్వయంతో 29వ తేదీన నిర్వహించే మెగా లోక్అదాలతను విజయవంతం చేద్దామని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శుక్రవారం పోలీసులతో మెగా లోక్ అదాలతపై సమీక్ష జరిపారు.
హిందూపురం, జూన 21: కోర్టు, పోలీసుల సమన్వయంతో 29వ తేదీన నిర్వహించే మెగా లోక్అదాలతను విజయవంతం చేద్దామని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శుక్రవారం పోలీసులతో మెగా లోక్ అదాలతపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా న్యాయాధికారి స్టేషనలవారీగా ఉన్న పెండింగ్ కేసులపై ఆరాతీశారు. వీటిలో రాజీకి వచ్చే కేసులన్నీ లోక్అదాలతలో పరిష్కరించాలన్నారు. దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోయిన ఇరువర్గాల కక్షిదారులను పిలిపించి వారితో మాట్లాడి పరిష్కారానికి మార్గం చూపాలన్నారు. చిన్నపాటి తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, భూతగాదాల కేసులను పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సీనియర్ సివిల్ న్యాయాధికారి శ్రీధర్, సెకెండ్క్లాస్ మెజిస్ర్టేట్ సుకుమార్, బార్ అసోసియేషన అధ్యక్షుడు రాజశేఖర్, వివిధ పోలీ్సస్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.