PALLE SINDHURA: సభ్యత్వంలో ప్రథమస్థానంలో నిలుపుదాం
ABN , Publish Date - Nov 02 , 2024 | 11:51 PM
నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేయించడంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమష్టి కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథ్రెడ్డి కోరారు.
పుట్టపర్తి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేయించడంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు సమష్టి కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథ్రెడ్డి కోరారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి క్లస్టర్, బూత ఇనచార్జిలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో 100శాతం పార్టీ సభ్యత్వాన్ని చేపట్టాలన్నారు. పార్టీ సభ్యత్వంతో కార్యకర్తలకు బీమా భరోసా ఉంటుందన్నారు.ప్రతి గ్రామం, వార్డుల్లో పర్యటించి సభ్యత్వ నమోదు చేయాలనిసూచించారు. వంద రూపాయల సభ్యత్వంతో రూ.5 లక్షల ప్రమాదబీమా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.