Share News

child marriag బాల్య వివాహాలను అరికడదాం: సీడీపీఓ

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:28 AM

బాల్య వివాహాలను అరికడదామని, ఇందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఐసీడీఎస్‌ సీడీపీఓ భారతి పిలుపునిచ్చా రు. మండలకేంద్రంలోని కేజీబీవీలో గురువారం బాలల హక్కులు, చ ట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.

  child marriag బాల్య వివాహాలను అరికడదాం: సీడీపీఓ

యల్లనూరు, జూలై18: బాల్య వివాహాలను అరికడదామని, ఇందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని ఐసీడీఎస్‌ సీడీపీఓ భారతి పిలుపునిచ్చా రు. మండలకేంద్రంలోని కేజీబీవీలో గురువారం బాలల హక్కులు, చ ట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.


ఇందులో సీడీపీఓ పాల్గొని మాట్లాడారు. బాల్య వివాహాల వలన అనేక అనర్థాలు జరుగుతాయన్నారు. చిన్నవయస్సులోనే గర్భం దాల్చడం వల్ల అనారోగ్యాలు తలెత్తుతాయన్నారు. మానసిక రుగ్మతలకు లోనవుతారన్నారు. కనుక ఎవరూ కూడా బాల్యవివాహాలను ప్రోత్సహించరాదని తెలిపారు. జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన ఆఫీసర్‌ మంజునాథ్‌, డిప్యూటీ తహసీల్దార్‌ శ్వే త ,ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రాధారమణి, ఏపీఎం ముత్యాలప్ప, ఎంఈఓ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 19 , 2024 | 12:28 AM