మండల అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దాం
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:08 AM
జిల్లాలోని అత్యంత వెనుకబడిన గుమ్మఘట్ట మండల అభివృద్ధికి స్థానిక మండల సభ్యులు, సర్పంచులు అందరూ పార్టీలక అతీతంగా సమష్టి కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఎంపీపీ భవానీ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. విప్ కాలవ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
- సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్ కాలవ పిలుపు
గుమ్మఘట్ట, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అత్యంత వెనుకబడిన గుమ్మఘట్ట మండల అభివృద్ధికి స్థానిక మండల సభ్యులు, సర్పంచులు అందరూ పార్టీలక అతీతంగా సమష్టి కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఎంపీపీ భవానీ అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. విప్ కాలవ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
మండల అభివృద్ధి కోసం తాను సీఎంతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తున్నానన్నారు. ఇప్పటికే రూ.698 కోట్ల నిధులతో బీటీపీ రిజర్వాయర్‌కు హంద్రీనీవా జలాలను అందించేందుకు కృషి చేస్తున్నామని, 30 శాతం పనులు కూడా పూర్తి చేశామని అన్నారు. వచ్చే రెండేళ్లలో మండలంలో గ్రామాలన్నీ అభివృద్ధి పథంలో నడిపేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీటీసీలు, సర్పంచులు కూడా సహాయ సహకారాలు అందించాలని, గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ తనను సంప్రదించాలని కోరారు. అనంతరం శాఖల వారీగా మండలంలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తుండగా.. ఆరోగ్యశాఖ అధికారులు అందించిన నివేదిక తనకే అర్థం కావడం లేదని, ఇక సభ్యులకు, సర్పంచులకు ఏమి అర్థమవుతాయని వైద్యాధికారి బాలాజీనాయక్‌పై కాలవ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖ కీలక మైనదని, ఇలాంటి తప్పుడు నివేదికలను ఇచ్చి మభ్యపెట్టవద్దని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలను గలగల, కేపీదొడ్డి సర్పంచులు రమేష్, సిద్ధన్న ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీనివాసులును ప్రభుత్వ విప్ ఆదేశించారు. సమావేశం అనంతరం సర్పంచులు, ఎంపీటీసీలు ఎమ్మెల్యేను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఎంపీడీఓ రామకృష్ణుడు, మండల ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, ఇతర మండలశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..