‘నిజం గెలవాలి’ విజయవంతం చేయండి
ABN , Publish Date - Feb 15 , 2024 | 12:06 AM
ఎన్టీఆర్ ట్రస్టు చైర్‌పర్సన, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ గురువారం గుడిబండ మండలం దిన్నేహట్టి గ్రామంలో పర్యటిస్తున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి కోరారు.
మడకశిరటౌన, ఫిబ్రవరి 14: ఎన్టీఆర్ ట్రస్టు చైర్‌పర్సన, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ గురువారం గుడిబండ మండలం దిన్నేహట్టి గ్రామంలో పర్యటిస్తున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి కోరారు. బుధవారం పార్టీ కార్యాలయంలో పర్యటనపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గురువారం ఉదయం 9 గంటలకు మడకశిర మండలం కల్లుమర్రి గ్రామానికి భువనేశ్వరీ చేరుకొంటారని, 9.30 గంటలకు మడకశిర పట్టణంలోని ఎనటీఆర్ సర్కిల్‌కు, 9.45 గంటలకు కదిరేపల్లి క్రాస్‌కు, 10 గంటలకు దిన్నేహట్టి గ్రామానికి ఆమె చేరుకొంటారని తెలిపారు. చంద్రబాబు అరెస్టయిన నేపథ్యంలో మృతి చెందిన ముత్తప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపు నిచ్చారు.ట