Share News

JDA: కౌలుగుర్తింపు కార్డులను సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:18 AM

కౌలు రైతులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుర్తింపు కార్డులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమాశంకరమ్మ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి సోమశేఖర్‌ ఆధ్వర్యంలో కౌలురైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

JDA: కౌలుగుర్తింపు కార్డులను సద్వినియోగం చేసుకోండి
JDA, Tehsildar giving identity cards to tenant farmers

గార్లదిన్నె, జూలై 25: కౌలు రైతులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన గుర్తింపు కార్డులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమాశంకరమ్మ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ అధికారి సోమశేఖర్‌ ఆధ్వర్యంలో కౌలురైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ భూములను కౌలుకు తీసుకున్న రైతులు ప్రభుత్వం అందచేసే కౌలు రైతు గుర్తింపు కార్డులు తప్పని సరిగా తీసుకోవాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కౌలు రైతులు సాగుచేసిన పంటలు నష్టపోతే పంటల బీమా, నష్టపరిహారం పొందాలంటే తప్పని సరిగా గుర్తింపు కార్డులు ఉండాలన్నారు. రైతులు సాగుచేసిన పంటలను ఈక్రాప్‌ నమోదు తప్పని సరిగా చేయించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వం రాయితీతో అందచేసే ఎరువులు, విత్తనాలు తదితర వాటిని పొందవచ్చన్నారు. కౌలు గుర్తింపు కార్డులు పొందిన రైతులకు బ్యాంకు రుణాలు కూడా మంజురు చేస్తారన్నారు. 2024-25 సంవత్సరంలో కౌలుకార్డులు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందచేశారు. తహసీల్దార్‌ లోకేశ్వరీ, డిప్యూటీ తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఏఈఓ స్రవంతి, వీఆర్వోలు గోపాల్‌రెడ్డి, వెంకటలక్ష్మి, వీఏఏ, వీహెచఏలు, ఎంపీఈఓలు పాల్గొన్నారు.

అనంతపురంరూరల్‌: కౌలు గుర్తింపు కార్డు పొందిన రైతులకు నష్టపరిహారం, క్రాప్‌ ఇన్సురెన్స పొందవచ్చని ఏఓ శశికళ అన్నారు. గురువారం ఎ.నారాయణపురం ఆర్‌ఎ్‌సఏలో కౌలు రైతుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఓ మాట్లాడుతూ.. కౌలుకు సాగు చేస్తున్న ప్రతి రైతు గుర్తింపు కార్డు పొందాలన్నారు. ఏఈఓ మురళీకృష్ణ, వీఆర్వో రమేష్‌, ఉద్యాన సహాయకులు రాజేశ్వరీ, నాగలత, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:18 AM