Manmohan singh సత్యసాయి భక్తుడు మన్మోహనసింగ్
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:22 AM
మాజీప్రధాని మన్మోహన సింగ్.. సత్యసాయి బాబా భక్తుడు. బాబాతో అత్యంత సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. ఈ కారణంగానే మన్మోహన సింగ్ పుట్టపర్తికి మూడుసార్లు విచ్చేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఓసారి, ప్రధాని హోదాలో పుట్టపర్తికి వచ్చారు. ఆర్థికమంత్రి హోదాలో తొలిసారి సత్యసాయిబాబా సన్నిధికి మన్మోహన సింగ్ విచ్చేసారు. ఆ సమయంలో బాబాతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.
ప్రధాని హోదాలో రెండుసార్లు పుట్టపర్తికి..
ఆర్థికమంత్రి హోదాలోనూ రాక..
పుట్టపర్తి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మాజీప్రధాని మన్మోహన సింగ్.. సత్యసాయి బాబా భక్తుడు. బాబాతో అత్యంత సాన్నిహిత్యం కలిగి ఉండేవారు. ఈ కారణంగానే మన్మోహన సింగ్ పుట్టపర్తికి మూడుసార్లు విచ్చేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఓసారి, ప్రధాని హోదాలో పుట్టపర్తికి వచ్చారు. ఆర్థికమంత్రి హోదాలో తొలిసారి సత్యసాయిబాబా సన్నిధికి మన్మోహన సింగ్ విచ్చేసారు. ఆ సమయంలో బాబాతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. తరువాత మన్మోహన సింగ్ ప్రధాని హోదాలో 2004 నవంబరు 22న సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సత్యసాయిబాబా జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. సత్యసాయిబాబా శివైక్యమైనపుడు 2011 ఏప్రిల్ 25న ప్రధాని హోదాలో రెండోసారి మన్మోహన సింగ్ పుట్టపర్తికి వచ్చారు. సత్యసాయి పార్థివదేహాన్ని సందర్శించారు. అలా పుట్టపర్తితో మన్మోహనసింగ్‌కు ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. ఆయన మృతితో పుట్టపర్తిలో విషాదఛాయలు
అలుముకున్నాయి.