Share News

టీడీపీలోకి భారీగా చేరికలు

ABN , Publish Date - May 06 , 2024 | 12:37 AM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంత అర్బన పర్యటన వేళ.. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా నాయకులు, కార్యకర్తలు చేరారు. ఆదివారం కూటమి అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్‌ సమక్షంలో 43వ డివిజనకు చెందిన మాజీ కార్పొరేటర్‌ మల్లెల దుర్గేష్‌తో పాటు 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు.

టీడీపీలోకి భారీగా చేరికలు
Daggubati Prasad joined TDP

అనంతపురం అర్బన, మే 5: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనంత అర్బన పర్యటన వేళ.. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా నాయకులు, కార్యకర్తలు చేరారు. ఆదివారం కూటమి అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్‌ సమక్షంలో 43వ డివిజనకు చెందిన మాజీ కార్పొరేటర్‌ మల్లెల దుర్గేష్‌తో పాటు 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి దగ్గుబాటి ప్రసాద్‌ పార్టీ కండువాలు వేసి టీడీపీలో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం దగ్గుబాటి ప్రసాద్‌ మాట్లాడుతూ... పోలింగ్‌కు మరో వారం రోజులే సమయం ఉందని, టీడీపీలో చేరిన వారి ప్రభావం ఏమిటో వైసీపీ నాయకులకు తెలిసే చేయాలన్నారు. అనంత అర్బనలో పార్టీ జెండాను ఎగురవేసేందుకు తమవంతు కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో 43వ డివిజనకు చెందిన శ్రీనివాసులు, ప్రసాద్‌, కిరణ్‌కుమార్‌, భార్గవ్‌, రాధ, తులసి, జ్యోతి, అలివేలమ్మ, బుడ్డప్ప నగర్‌కు చెందిన బజంత్రి నాగరాజు, శ్రీనివాసులు, సురేంద్ర, చంద్ర, విజయ్‌, మస్తాన, మల్లేష్‌, యోగేంద్ర, రమేష్‌ ఉన్నారు.


టీడీపీకి ఓటు వేస్తే .. భవిష్యత్తుకు వేసినట్లే..

టీడీపీకి ఓటు వేస్తే.. మనందరి భవిష్యత్తు కోసం ఓటు వేసినట్టేనని కూటమి అర్బన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్‌ సతీమణి దగ్గుబాటి శ్రీ లక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక 40వ డివిజన పరిధిలోని ఆజాద్‌ నగర్‌, రహమత ఫంక్షన హాల్‌ పరిసర ప్రాంతాల్లో ఆమె ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి మేనిఫెస్టో కరపత్రాలు అందజేశారు. తన భర్త దగ్గుబాటి ప్రసాద్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - May 06 , 2024 | 12:37 AM