వృద్ధులకు వైద్యపరీక్షలు
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:28 AM
ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా స్థానిక సత్యసాయి వృద్ధాశ్రమంలో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు.
పుట్టపర్తిరూరల్, అక్టోబరు 1 : ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా స్థానిక సత్యసాయి వృద్ధాశ్రమంలో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎన్సీడీ పోగ్రాం డైరక్టర్ డాక్టర్ నివేదిత మాట్లాడుతూ.. వృద్ధులకు మానసిక ప్రశాంతత చాలా అవసరమన్నారు. వృద్ధులకు ఎటువంటి ఆనారోగ్య సమస్యలు తలెత్తినా అందుబాటులో ఉండి వైద్యపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎపిడామాలజిస్టు బాలాజీనాయక్, ఎనుమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ జోత్స్న, సామాజిక వైద్య అధికారి నగేష్, పీహెచఎన లలితకుమారి, ఎంఎల్‌హెచపీ విజయ్‌భాస్కర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.