Share News

APTF: సీనియారిటీ జాబితాలో పొరబాట్లను సరిదిద్దాలి

ABN , Publish Date - Nov 02 , 2024 | 12:32 AM

మున్సిపల్‌ టీచర్ల ఉద్యోగోన్నతులకు సంబంఽధించిన సీనియారిటీ జాబితాలోని లోపాలను సరిచేయాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డీఈఓ ప్రసాద్‌ బాబును కోరారు. శుక్రవారం ఆ సంఘం నాయకులు డీఈఓను ఆయన చాంబర్‌లో కలిశారు.

APTF: సీనియారిటీ జాబితాలో పొరబాట్లను సరిదిద్దాలి
APTF leaders giving petition to DEO

అనంతపురం విద్య, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ టీచర్ల ఉద్యోగోన్నతులకు సంబంఽధించిన సీనియారిటీ జాబితాలోని లోపాలను సరిచేయాలని ఏపీటీఎఫ్‌ నాయకులు డీఈఓ ప్రసాద్‌ బాబును కోరారు. శుక్రవారం ఆ సంఘం నాయకులు డీఈఓను ఆయన చాంబర్‌లో కలిశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్‌, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన మాట్లాడుతూ సీనియారిటీ జాబితాలో రిటైర్డ్‌ అయిన వాళ్ల్లు, చనిపోయిన వారి పేర్లు సైతం ఉంచారన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఉన్న వివిధ పోస్టుల ఖాళీల వివరాలను ఇంత వరకూ ప్రకటించలేదన్నారు. పలువురు టీచర్ల వివరాలు, అర్హతలు వారి సర్వీస్‌ రిజిస్టర్‌లో నమోదైనప్పటికీ సీనియారిటీ జాబితాలో ప్రస్తావించలేదన్నారు. లోపాలు సవరించి సీనియారిటీ జాబితా విడుదల చేయాలని కోరారు. అపార్‌ ఐడీ జనరేషన కోసం క్షేత్ర స్థాయిలో అనేక ఇబ్బందులు తప్పడం లేదన్నారు. స్కూళ్లలో ఆధార్‌ కార్డు, బర్త్‌ సర్టిఫికెట్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు డీఈఓకు వినతిపత్రం అందించారు. సంఘం పూర్వ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నరసింహులు, ఇతర నాయకులు బాబా ఫకృద్దీన, సర్ధార్‌ వలి, రమణ, కరీముల్లా, నస్రుల్లా, తిప్పేస్వామి, రామ్మూర్తి, హిమగిరి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 12:32 AM