Mla Paritala రైతు కళ్లలో ఆనందం
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:04 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. సబ్సిడీపై మంజూరైన డ్రిప్, స్ర్పింక్లర్ పరికరాలను చెన్నేకొత్తపల్లిలో ఆదివారం రైతులకు ఆమె పంపిణీ చేశారు.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సబ్సిడీపై డ్రిప్, స్ర్పింక్లర్ల పంపిణీ
చెన్నేకొత్తపల్లి, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. సబ్సిడీపై మంజూరైన డ్రిప్, స్ర్పింక్లర్ పరికరాలను చెన్నేకొత్తపల్లిలో ఆదివారం రైతులకు ఆమె పంపిణీ చేశారు. ధర్మవరం టీడీపీ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్‌తో కలిసి పచ్చజెండా ఊపి సబ్సిడీ పరికరాలను తరలించే వాహనాలను ప్రారంభించారు. అనంతరం రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాలకు సంబంధించి 60మంది రైతులకు మంజూరైన డ్రిప్, స్ర్పింకర్ల పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ వ్యవసాయంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టారన్నారు. దేశంలో మొట్టమొదటి సారిగా డ్రిప్‌ను తీసుకువచ్చి రైతులకు సబ్సిడీపై అందించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. గత వైసీపీ పాలనలో సబ్సిడీపై డ్రిప్, స్ర్పింకర్లు అందక రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారన్నారు. ధర్మవరం టీడీపీ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబనాయుడు లక్ష్యమని, ఆ దిశగా రైతులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎంఐపీ పీడీ సుదర్శన, టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు రంగయ్య, రామగిరి, కనగాననల్లి, సీకేపల్లి మండలాల కన్వీనర్‌లు సుధాకర్, పోతలయ్య, ముత్యాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దండు ఓబులేశు, రామ్మూర్తినాయుడు, అంకేఅమరేంద్ర పాల్గొన్నారు.