బీసీ కాలనీలో ఎమ్మెల్యే పర్యటన
ABN , Publish Date - Dec 06 , 2024 | 01:10 AM
మండలకేంద్రంలోని బీసీ కాలనీలో గు రువారం ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పర్యటించా రు. అక్కడ రోడ్లను పరిశీలించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం అధికంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. గృహాల నుంచి వెలువడిన చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు.
పెద్దవడుగూరు, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని బీసీ కాలనీలో గు రువారం ఎమ్మెల్యే జేసీ అశ్మిత రెడ్డి పర్యటించా రు. అక్కడ రోడ్లను పరిశీలించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం అధికంగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. గృహాల నుంచి వెలువడిన చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు.
ప్రజలు ఇళ్లలోని చెత్తను చెత్తకుండీలలోనే వేయాలన్నారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పంటపొలాలకు సాగునీరు సమృద్ధిగా ఉందని, రైతులు ఎవరూ సందేహాలు పెట్టుకోవద్దని పేర్కొన్నారు. అనంతరం స్థానిక సమస్యలపై ఆరాతీశారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కన్వీనర్ కొండూరు కేశవరెడ్డి, జిల్లా తెలుగుయువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ దివాకర్‌రెడ్డి, నాయకులు గంగరాజుయాదవ్, నాగరాజు, లక్ష్మినారాయణ, దస్తగిరి, చిరంజీవి ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తలు..