MRPS: ఎమ్మార్పీఎస్ సంబరాలు
ABN , Publish Date - Aug 01 , 2024 | 11:54 PM
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందక్రిష్ణ నాయకత్వంలో చేపట్టిన సుదీర్ఘ పోరాటం ఫలించిందని ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చెన్నేకొత్తపల్లిలో గురువారం సంబరాలు జరుపుకున్నారు.
చెన్నేకొత్తపల్లి, ఆగస్టు 1: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందక్రిష్ణ నాయకత్వంలో చేపట్టిన సుదీర్ఘ పోరాటం ఫలించిందని ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చెన్నేకొత్తపల్లిలో గురువారం సంబరాలు జరుపుకున్నారు. అందరివాడు ఉత్సవ సొసైటీ అధ్యక్షుడు నరసింహులు ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి, మందక్రిష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం కేక్‌కట్‌చేసి స్వీట్లను పంపిణీ చేశారు.
రామగిరి: సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణకు పచ్చజెండా చూపడంతో ఎమ్మార్పీస్, ఎస్సీసెల్ నాయకులు పేరూరులో గురువారం సంబరాలు చేసుకున్నారు. పేరూరులో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ కమిటీ ప్రెసిడెంట్ గంగయ్య, దండోర శ్రీరాములు, టీడీపీ మండల మాజీ కన్వీనర్ సుబ్బరాయుడు, మాజీ సర్పంచ గంగాధర్ పాల్గొన్నారు.
గార్లదిన్నె: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదిరప్ప అన్నారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ చేసే అధికారం ఆయా రాష్ట్రాలకు వ్వడం సంతోషకరమరన్నారు.
శింగనమల: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు హర్షణీయమని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు చిన్న జలాలపురం ఓబిలేసు, టీడీపీ సోషల్ మీడియా కోర్డినేటర్ మెండిపోగుల ఎర్రిస్వామి అన్నారు. వర్గీకరణకు సహకరించిన ప్రధాని నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, మందకృష్ణమాదిగకు కృతజ్ఞతలు తెలిపారు.