MODEL TEACHERS: ‘మోడల్’ టీచర్లకూ కామన ప్రయోజనాలు
ABN , Publish Date - Aug 26 , 2024 | 12:29 AM
మోడల్ స్కూళ్లలో నియమితులైన ప్రిన్సిపాళ్లు, టీచర్లకు రెగ్యులర్ టీచర్ల సర్వీసు ప్రయోజనాలను అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉపాధ్యాయభవనలో ఎస్టీయూ అనుబంధ సంస్థ ఏపీమోడల్ స్కూల్స్ ఎస్టీయూ(ఏపీఎంఎ్‌సఎస్టీయూ) జిల్లా కార్యవర్గసమావేశం నిర్వహించారు.
అనంతపురం విద్య, ఆగస్టు 25: మోడల్ స్కూళ్లలో నియమితులైన ప్రిన్సిపాళ్లు, టీచర్లకు రెగ్యులర్ టీచర్ల సర్వీసు ప్రయోజనాలను అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉపాధ్యాయభవనలో ఎస్టీయూ అనుబంధ సంస్థ ఏపీమోడల్ స్కూల్స్ ఎస్టీయూ(ఏపీఎంఎ్‌సఎస్టీయూ) జిల్లా కార్యవర్గసమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఏపీఎంఎ్‌సఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మోహనరెడ్డి మాట్లాడుతూ మోడల్ స్కూళ్లు స్థాపించి 12 ఏళ్లు అయినా.....మోడల్ స్కూళ్ల బోధనా సిబ్బందికి రెగ్యులర్ టీచర్ల ప్రయోజనాలు అమలు చేయడం లేదన్నారు. వెంటనే అమలు చేసి న్యాయం చేయాలన్నారు. పలు కారణాలతో మరణించిన 21 మంది టీచర్ల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అనంతరం ఏపీఎంఎ్‌సఎస్టీయూ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆ యూనియన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మునిరత్నం, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి రామాంజనేయులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం: జిల్లా గౌరవాధ్యక్షులుగా సతీ్‌షకుమార్, అధ్యక్షులుగా శ్రీరాములు, ప్రధానకార్యదర్శిగా తిమ్మయ్య, కోశాధికారిగా సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఓబుల్‌రెడ్డి, యాదమూర్తి, రమే్‌షకుమార్, ఐదుగురు ఉపాధ్యక్షులు, నలుగురు జాయింట్ సెక్రెటరీలుగా నియమించారు.