Muncipal Chairman మంచి చేయాలనే తప్ప.. తిట్టాలని కాదు
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:29 PM
జేసీ ఫ్యామిలీని ఈ స్థా యికి తెచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఏమై నా మంచి చేయాలనే తపన తప్ప, తిట్టాలనేది తన ఉద్దేశ్యం కా దని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
మున్సిపల్ చైర్మన జేసీపీఆర్
తాడిపత్రి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జేసీ ఫ్యామిలీని ఈ స్థా యికి తెచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఏమై నా మంచి చేయాలనే తపన తప్ప, తిట్టాలనేది తన ఉద్దేశ్యం కా దని మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఊరు తమ కుటుంబాన్ని ఉన్నతస్థాయికి చేర్చిందని, ఈ ఊరి ప్రజలకు మంచి చేయడానికి ఎంతదూరమైన వెళతామని ఆయన భావోద్వేగంతో అన్నారు. ఈ ఊరి ప్రజల బాగు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానే తప్ప వారిని తిట్టాలని ఉద్దేశం తనలో ఏమాత్రం లేదన్నారు. ప్రజల్లో మార్పు కోసం ఏదో తిట్టింటానే తప్ప మరోటి కాదన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక గోల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అప్పుడే మనం అనుకున్న స్థాయికి ఎదగగలమని సూచించారు. ప్రస్తుతం అందరూ ఉన్నత చదువులు చదివిన వారే ఉన్నారు. కానీ వారికి క్రమశిక్షణ లేకుండా పోతోందని బాధ కలుగుతోందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించే పద్ధతులు మంచిగా ఉండాలని వారిని విచ్చలవిడిగా విడిచిపెడితే బాధ్యత లేకుండా తయారవుతా రని ఆయన హెచ్చరించారు. చదువుతోపాటు జ్ఞానం కూడా ఉండాలన్నారు. నేటి కాలంలో చదువురానివారు కూడా లక్షలు సంపాదిస్తున్నారు కానీ చదువుకున్న వారు కొందరు ఇళ్లవద్దే ఉండి తల్లిదండ్రులకు బరువుగా ఉండటం బాధాకరమని తెలిపారు. ప్రస్తుతం పిల్లలు కొందరు ఏం చేస్తున్నారంటే జాబ్ సెర్చ్‌లో ఉన్నాము అనడమే తప్ప జాబ్ చేస్తున్నామని చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.