Share News

TEACHERS: మున్సిపల్‌ టీచర్ల బదిలీలు చేపట్టాలి

ABN , Publish Date - Aug 05 , 2024 | 12:11 AM

అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషనలోని స్కూళ్లలో టీచర్ల కొరత ఉందని, వెంటనే బదిలీలు చేపట్టాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో నగర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

TEACHERS: మున్సిపల్‌ టీచర్ల బదిలీలు చేపట్టాలి
Phani Bhushan is speaking

అనంతపురం విద్య, ఆగస్టు 4: అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషనలోని స్కూళ్లలో టీచర్ల కొరత ఉందని, వెంటనే బదిలీలు చేపట్టాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో నగర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘం మున్సిపల్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఫణిభూషణ్‌ మాట్లాడుతూ ఆగస్టు నెల వచ్చినా టీచర్ల సర్దుబాటు చేయకపోవడం దారుణం అన్నారు. వెంటనే బదిలీలు చేపట్టి టీచర్ల సమస్య తీర్చాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సైతం వెంటనే ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. టీచర్ల రేషనలైజేషన నిర్వహించి విద్యార్థులు ఎక్కువ ఉన్న స్కూళ్లకు పోస్టులను సర్దుబాటుచేయాలన్నారు. ఎల్‌ఎ్‌ఫఎల్‌ హెచఎం పోస్టులలో ఉన్న వారి విల్లింగ్‌ ఆధారంగా స్కూల్‌ అసిస్టెంట్స్‌గా కన్వర్షన చేయాలని కోరారు. తెలుగు, హిందీ సబ్జెక్టుల ఉద్యోగోన్నతులు వెంటనే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ టీచర్ల జీపీఎఫ్‌ కాతాలను జారీ చేయడంలో ఉన్న జాప్యాన్ని నివారించాలన్నారు. గతంలో అనంతపురం నగరపాలక సంస్థ పీఎ్‌ఫలో ఉన్న టీచర్ల మొత్తాలను వెంటనే చెల్లించాలని కోరారు. సంఘం జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి రామాంజనేయులు, మురళీకృష్ణ, విరూపాక్ష గౌడ్‌, వేణుగోపాల్‌, కృష్ణమూర్తినాయుడు, సురేష్‌, ప్రభార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 12:11 AM