Share News

DOCTORS AGITATION: నరహంతకులను కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Aug 20 , 2024 | 11:54 PM

కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం చేసిన నరహంతకులను కఠినంగా శిక్షించాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేశారు. ఘటనపై జిల్లాకేంద్రంలో జూనియర్‌ డాక్టర్లు ఆందోళన కొనసాగించారు. జిల్లా సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మంగళవారం వందలాదిమంది పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

DOCTORS AGITATION: నరహంతకులను కఠినంగా శిక్షించాలి
Judas are continuing the relay in the hospital premises

అనంతపురం టౌన, ఆగస్టు 20: కోల్‌కతా వైద్యురాలి హత్యాచారం చేసిన నరహంతకులను కఠినంగా శిక్షించాలని జూనియర్‌ డాక్టర్లు డిమాండ్‌ చేశారు. ఘటనపై జిల్లాకేంద్రంలో జూనియర్‌ డాక్టర్లు ఆందోళన కొనసాగించారు. జిల్లా సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మంగళవారం వందలాదిమంది పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. మహిళాడాక్టర్‌ను హత్యచేసిన నరహంతకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, డ్యూటీలో ఉంటున్న డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. సాయంత్రం 5గంటల వరకు దీక్షలు కొనసాగించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ వేర్వేరుగా జూడాలు కలిసి తమ డిమాండ్లు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసికెళ్లాలని కోరుతూ వినతులు అందజేశారు. జూడాల ఆందోళనలకు మేయర్‌ మేయర్‌ వసీం, ఎనఎ్‌సఎ్‌స పోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పరదేశీనాయుడు, పలువురు సీనియర్‌ డాక్టర్లు పాల్గొని సంఘీభావం తెలిపారు. జూడాలు రాఘవేంద్ర, హరినాథ్‌రెడ్డి, సమరసింహారెడ్డి, ప్రణయ్‌రెడ్డి, సిందూచౌదరి, వర్షిత పాల్గొన్నారు.


అనంతపురంరూరల్‌: మండలంలోని చియ్యేడు పాఠశాలలో నవ్యాంధ్ర టీచర్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో వైద్యురాలి హత్యాచారానికి నిరసన చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. అసోసియేషన రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగేంద్ర, ఇతర టీచర్లు, విద్యార్థులు కొవ్వొత్తులతో సంఘీభావం తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, ఉపాధ్యాయులు విజయ్‌, ఉమామహేశ్వర్‌, నివేదిత, నాగమణి, భారతి, పుల్లయ్య, భాస్కర్‌రెడ్డి, నళినాక్షి, శిరీష, ప్రసాద్‌ పాల్గొన్నారు.

గార్లదిన్నె: కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పీహెచసీ వైద్యాధికారి డాక్టర్‌ గౌతమి డిమాండ్‌ చేశారు. మంగళవారం వైద్య సిబ్బందితో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు. ఆమె మాట్లాడుతూ... వైద్యులు దేవుళ్లతో సమానమన్నారు. అలాంటి వైద్యురాలిని అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమన్నారు. వైద్యాధికారులు గౌతమి, మంజుల, అనీష, దిలీప్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2024 | 11:54 PM