Share News

GUMMANURU: ముస్లింలు టీడీపీకి వెన్నుదన్నుగా నిలవాలి

ABN , Publish Date - May 04 , 2024 | 12:27 AM

ముస్లింలు టీడీపీకి వెన్నంటి నిలిచి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయాలని ఉమ్మడి అభ్యర్థి గుమ్మనూరు జయరాం కోరారు. పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద ఉన్న మసీదులో శుక్రవారం నమాజు అనంతరం ముస్లింలను కలసి తనకు ఓటువేసి గెలిపించాలని జయరాం అభ్యర్థించారు.

GUMMANURU: ముస్లింలు టీడీపీకి వెన్నుదన్నుగా నిలవాలి
ఈద్గా మసీదు వద్ద ఓటును అభ్యర్థిస్తున్న జయరాం

కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు

గుంతకల్లు, మే 3: ముస్లింలు టీడీపీకి వెన్నంటి నిలిచి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయాలని ఉమ్మడి అభ్యర్థి గుమ్మనూరు జయరాం కోరారు. పట్టణంలోని ఈద్గా మైదానం వద్ద ఉన్న మసీదులో శుక్రవారం నమాజు అనంతరం ముస్లింలను కలసి తనకు ఓటువేసి గెలిపించాలని జయరాం అభ్యర్థించారు. పార్టీ కరపత్రాలను అందజేసి ఈవీఎంలో మొదటి నెంబరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను, తొలి స్థానంలో ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ ఉంటామని రెండు ఓట్లూ సైకిల్‌ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. అలాగే ధర్మవరం గేటు వద్ద వ్యాపార సముదాయాలలో, పట్టణంలోని 22, 23 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. పాత బస్టాంటు వద్ద ఉన్న స్వర్ణకారుల షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ప్రచారంచేశారు. స్వర్ణకారుల సమస్యలను పరిష్కరించడానికి కృషిచేస్తానన్నారు. రాత్రి పరిటాల శ్రీరాములు కళ్యాణమండపంలో ఎస్సీ కుల సంఘాలతో జయరాం భేటీ అయ్యారు.


కార్యక్రమంలో బండారు ఆనంద్‌, బీఎస్‌ కృష్ణారెడ్డి, కేసీ హరి, పత్తి హిమబిందు, గుజరీ మహమ్మద్‌ ఖాజా, ప్రతాప్‌ నాయుడు, తలారి మస్తానప్ప, హనుమంతు, అంజి, ముష్టూరు తిమ్మప్ప, ఫ్రూట్‌ మస్తాన, ఫజులు, యూసుఫ్‌, పూల రమణ, కొలిమి రామాంజనేయులు, పట్టణంలోని పలు మసీదుల వద్ద గుమ్మనూరు నారాయణ స్వామి, కోడెల చంద్రశేఖర్‌, ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌ ముస్లింలను కలసి టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేశారు. పార్టీ కార్యాలయంలో పట్టణానికి చెందిన పలు వార్డులవారు జయరాం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

గుత్తి: గుత్తి ఆర్‌ఎ్‌సలోని 25వ వార్డు మెయిన బజార్‌లో గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. శ్రీపురం గ్రామానికి చెందిన పది కుటుంబాలవారిని పార్టీ కండువాలతో నారాయణ టీడీపీలోకి ఆహ్వానించారు.


20 కుటుంబాలు చేరిక

పామిడి: మండలంలోని ఖాదర్‌పేట, గజరాంపల్లి గ్రామాల నుంచి 20 కుటుంబాలు శుక్రవారం టీడీపీలోకి చేరాయి. స్థానిక టీడీపీ కార్యాలయంలో గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - May 04 , 2024 | 12:27 AM