Share News

ENCROCHING: నా భూమి స్వాధీనం చేసుకుంటున్నారు

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:31 PM

తన భూమిని వెంకటరాముడు అనే వ్యక్తి ఆనలైన చేయించుకుని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని కనగానపల్లి మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన దళిత వృద్ధురాలు పెద్దక్క ఆర్డీఓ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది.

ENCROCHING: నా భూమి స్వాధీనం చేసుకుంటున్నారు
An old woman explaining the problem to the RDO

ధర్మవరంరూరల్‌ (కనగానపల్లి) జూలై 22: తన భూమిని వెంకటరాముడు అనే వ్యక్తి ఆనలైన చేయించుకుని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని కనగానపల్లి మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన దళిత వృద్ధురాలు పెద్దక్క ఆర్డీఓ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. సోమవారం ధర్మవరంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వెంకటశివరామిరెడ్డి నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో ఆమె ఫిర్యాదు చేశారు. కుర్లపల్లి గ్రామానికి చెందిన తనకు దాదులూరు గ్రామ పొలం సర్వేనెంబర్‌ 78-1లో ఐదు ఎకరాల ఉందన్నారు. 50ఏళ్లుగా పంటలు సాగు చేస్తున్నామన్నారు. నా భర్త బతికున్నప్పుడు ఆ భూమిలో వేరుశనగ, కంది, జొన్న, ఉలవలు సాగు చేసుకుని జీవనం సాగించేవారమన్నారు. నాకు ముగ్గురు కుమారులు ఉన్నారని, బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఇదే అదునుగా భావించిన చంద్రాచెర్ల గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తుల సహాయంతో వెంకటనాయుడు పేరు మీద ఆనలైనలో ఎక్కించుకున్నారన్నారు. ఆనలైనలో వనబీ కోసం వెళ్లితే వెంకటనాయుడు పేరు మీద వస్తుండటం చూసి తహసీల్దార్‌ ఆఫీసుకు వెళ్లితే వాళ్లు తమను బెదిరిస్తున్నారని వాపోయారు. అత్యంత పేదలమని, దయ ఉంచి గ్రామంలో విచారణ చేసి భూమిని తమకు ఆనలైనలో నమోదు చేయించాలని బాధితురాలు ఆర్డీఓకు విన్నవించింది.

Updated Date - Jul 22 , 2024 | 11:31 PM