Share News

New Criminal Laws : కొత్త చట్టాలు ప్రమాదకరం

ABN , Publish Date - Jul 13 , 2024 | 12:03 AM

కొత్త క్రిమినల్‌ చట్టాలు ప్రజల జీవితాలకు ప్రమాదకరమైనవని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన (ఐలు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఐలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన క్రిమినల్‌ చట్టాల మీద జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన హాల్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బెయిల్‌ మంజూరులో మార్గదర్శకాలు, పోలీసు అధికారులను ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్లుగా పరిగణించడం, జ్యుడీషియరీ అధికారాలు ...

 New Criminal Laws : కొత్త చట్టాలు ప్రమాదకరం
Rajendra Prasad speaking

ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌

అనంతపురం క్రైం, జూలై 12: కొత్త క్రిమినల్‌ చట్టాలు ప్రజల జీవితాలకు ప్రమాదకరమైనవని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన (ఐలు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఐలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన క్రిమినల్‌ చట్టాల మీద జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన హాల్‌లో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బెయిల్‌ మంజూరులో మార్గదర్శకాలు, పోలీసు


అధికారులను ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్లుగా పరిగణించడం, జ్యుడీషియరీ అధికారాలు నియంత్రించేలా ఉండటం వంటి అంశాలు కొత్త చట్టాలలో ఉన్నాయని అన్నారు. ఇటీవల భద్రాచలంలో కృష్ణప్రసాద్‌ అనే న్యాయవాదిని అరెస్టు చేసి, గొలుసులతో కట్టి కోర్టుకు తీసుకెళ్లిన ఘటన, అక్కడ పోలీసు అధికారి చట్టం ద్వారా పోలీసులకూ అధికారం ఉందని మాట్లాడిన తీరు న్యాయవాద సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. కొత్త చట్టాల అమలు ద్వారా న్యాయవాదులకు సవాళ్లు ఎదురుకానున్నాయని అన్నారు. చట్టాలు రూపొందించే ప్రక్రియ సరిగా జరగలేదని అన్నారు. ఐలు బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ రామిరెడ్డి, జిల్లా బార్‌ అసోసియేషన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురుప్రసాద్‌, రాజేంద్రప్రసాద్‌, ఐలు ప్రతినిధులు సతీష్‌, వీరూ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 13 , 2024 | 12:03 AM