Share News

గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి దొర్లకూడదు

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:15 AM

అపశ్రుతులు దొర్లకుండా గణేష్‌ నిమజ్జనం చేపట్టాలని జిల్లా ఎస్పీ జగదీష్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎస్పీ పంపనూరు సమీపంలోని వినాయక నిమజ్జనం ప్రాంతాన్ని సందర్శించారు. గణేష్‌ ప్రతిమలను కాలువ నీటిలో నిమజ్జనం చేయడాన్ని పర్యవేక్షించారు.

గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి దొర్లకూడదు
SP supervising immersion arrangements

అనంతపురం క్రైం, సెప్టెంబరు 9: అపశ్రుతులు దొర్లకుండా గణేష్‌ నిమజ్జనం చేపట్టాలని జిల్లా ఎస్పీ జగదీష్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఎస్పీ పంపనూరు సమీపంలోని వినాయక నిమజ్జనం ప్రాంతాన్ని సందర్శించారు. గణేష్‌ ప్రతిమలను కాలువ నీటిలో నిమజ్జనం చేయడాన్ని పర్యవేక్షించారు. ఎలాంటి ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీఎస్పీ, ఎస్‌ఐలకు పలు సూచనలు చేశారు.

విగ్రహాల ఊరేగింపునకు రూట్‌ మ్యాప్‌: సప్తగిరి సర్కిల్‌-రాజీవ్‌ రోడ్డు-శ్రీకంఠం సర్కిల్‌- తిలక్‌రోడ్డు- తాడిపత్రి బస్టాండ్‌-గాంధీబజార్‌-బసవన్నకట్ట-సూర్యానగర్‌సర్కిల్‌-టవర్‌క్లాక్‌ -పీటీసీ- నడిమివంక - కళ్యాణదుర్గం బైపాస్‌(10 అడుగుల కంటే ఎత్తైన విగ్రహాలు పంపనూరు కెనాల్‌ వద్ద నిమజ్జనం చేయాలి). బళ్లారి బైపాస్‌(10 అడుగుల కంటే తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలు రాచానపల్లి వంక వాడలో నిమజ్జనం చేయాలి)


మధ్యాహ్నం 3గంటల నుంచే..: 11వతేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచే గణేష్‌ విగ్రహాలు ఊరేగింపును ప్రారంభించాలని మంటపాల నిర్వాహకులకు పోలీసులు సూచించారు. 10 అడుగుల కంటే తక్కువ ఎత్తున్న విగ్రహాలను అనంతపురం రూరల్‌ మండలంలోని రాచానపల్లిలో నిమజ్జనం చేయాలని సూచించారు. 10 అడుగుల కంటే ఎత్తున్న విగ్రహాలను పంపనూరు కెనాల్‌లో నిమజ్జనం చేయాలన్నారు. ఎత్తైన విగ్రహాలను నిమజ్జనానికి తీసుకుని వెళ్లడానికి రుద్రంపేట బైపాస్‌, బళ్లారి బైపాస్‌, కళ్యాణదుర్గం బైపా్‌సలలోని నేషనల్‌ హైవే బ్రిడ్జ్‌ ఆటంకం కలుగుతుందని, తపోవనం సర్కిల్‌ మీదుగా సర్వీస్‌ రోడ్డులో తీసుకెళ్లి కళ్యాణదుర్గం రోడ్డుకు వెళ్లాలి. కార్లు, లారీలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు ఇతర భారీ వాహనాలు తపోవనం సర్కిల్‌, రవి పెట్రోల్‌ బంక్‌, రాజహంస అపార్ట్‌మెంట్‌, పంగల్‌రోడ్డు, కలెక్టరేట్‌, భాస్కర్‌ పెట్రోల్‌ బంక్‌, మేడా పెట్రోల్‌ బంక్‌, మిర్చియార్డు, తడకలేరు మీదుగా వెళ్లడం నిషేధం. నగరంలో నిమజ్జనం సందర్భంగా 500 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నారు.

Updated Date - Sep 10 , 2024 | 12:15 AM