Share News

crime రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:36 AM

మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

crime రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

- మరొకరికి గాయాలు

తాడిపత్రి, సెప్టెంబరు 6: మండలంలోని వెంకటరెడ్డిపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. రూరల్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.


మండలంలోని గదరగుట్టపల్లి గ్రామానికి చెందిన లాలెప్ప (66), విఘ్నేశ్వరరెడ్డి పనినిమిత్తం ద్విచక్రవాహనంలో తాడిపత్రికి వచ్చారు. పని అనంతరం స్వగ్రామానికి బయలుదేరారు. వెంకటరెడ్డిపల్లి గ్రామ సమీపంలోకి వెళ్లగానే ఎదురుగా నాపరాళ్ల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొంది. ప్రమాదంలో లాలెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విఘ్నేశ్వరరెడ్డికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. మృతుడికి భార్య రాజకుళ్లాయమ్మ, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Sep 07 , 2024 | 12:36 AM