EYE HOSPITAL: సంచార నేత్ర వైద్యశాల ప్రారంభం
ABN , Publish Date - Dec 02 , 2024 | 12:22 AM
పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో సేవలందించే సంచార వైద్యశాల వాహనాన్ని స్థానిక ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో ఆదివారం సత్యసాయి సెంట్రల్‌ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ ప్రారంభించారు.
పుట్టపర్తి, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో సేవలందించే సంచార వైద్యశాల వాహనాన్ని స్థానిక ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో ఆదివారం సత్యసాయి సెంట్రల్‌ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ ప్రారంభించారు. వాహనానికి పూజలు చేసి, ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, సేవాసంస్థలు సంయుక్తంగా సత్యసాయి నేత్రమిత్ర పేరిట మొబైల్ ఐక్లినిక్ సేవలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లోని మారుమూల గ్రామాల్లో ఆఽధునిక వైద్యసేవలు అందించడానికి మొబైల్ క్యాంప్‌ను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో సత్యసాయి సేవాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో హైదరాబాద్ భక్తులు రెండోరోజు ఆదివారం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరింపజేశాయి. మొదట సౌమ్య వారణాసి బృందం గానంతో భక్తులు తన్మయం పొందారు. అనంతరం బాలవికాస్ చిన్నారులు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అంటూ నృత్యాన్ని ప్రదర్శించారు. భక్తిపాటలు, నృత్యంతో అలరింపజేశారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.