summar: తాటిముంజలకు భలే గిరాకీ..
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:43 AM
ధర్మవరం రూరల్, ఏప్రిల్ 28: ప్ర స్తుతం ఎండలు విపరీతంగా మండుతున్నా యి. ఎండవేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు పలు దారులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో తాటి ముంజలకు భ లే డిమాండ్ ఏర్పడింది. ఎండలకు తాటిముంజలు తింటే చలవ చేస్తుందని ప్రజలు వాటి కోనుగోలుకు ఎగబడుతున్నారు. దీంతో వాటికి డిమాండ్ పెరిగింది.
summar: తాటిముంజలకు భలే గిరాకీ..
- వేసవి తాపం నుంచి ఊరట చెందడానికి వాటిపై ఆసక్తి చూపుతున్న ప్రజలు
- భారీగా కొనుగోలు
- పెరిగిన డిమాండ్
ధర్మవరం రూరల్, ఏప్రిల్ 28: ప్ర స్తుతం ఎండలు విపరీతంగా మండుతున్నా యి. ఎండవేడిమికి జనం విలవిల్లాడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు పలు దారులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో తాటి ముంజలకు భ లే డిమాండ్ ఏర్పడింది. ఎండలకు తాటిముంజలు తింటే చలవ చేస్తుందని ప్రజలు వాటి కోనుగోలుకు ఎగబడుతున్నారు. దీంతో వాటికి డిమాండ్ పెరిగింది.
తినడానికి రుచిగా ఉండడంతో పాటు వాటి వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా లభిస్తుండటంతో వాటి కోనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పట్టణంలోని కాలేజ్సర్కిల్, కొత్తపేట, కదిరిగేటు సమీపంలో గ్రామీణప్రాంతాల వాసు లు తాటిముంజలు తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. డజన రూ.60లు చొప్పున ధర చెబుతున్నారు. మఽధ్యాహ్నం కల్లా తెచ్చిన తాటిముంజలన్నీ అయిపోతున్నాయని, ఒక్కొక్కరం సు మారు రోజుకు వంద డజనలకు పైగా అమ్ముతున్నామని అమ్మకం దారులు పేర్కొంటున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....