Share News

GOD : పవనపుత్రా పాహిమాం..!

ABN , Publish Date - Jun 01 , 2024 | 11:54 PM

హనుమజ్జయంతి వేడుకలను ఆంజనేయ స్వామి ఆలయాల్లో శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే మూల విరాట్లకు వివిధ అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. అలాగే హనుమాన చాలీసా పారా యణం, భజనలు, రామ కీర్తనలు, రామ నామం, ఆంజనేయ దండకంతో ఆలయాలు మార్మోగాయి. పలు ఆలయాల్లో సీతారామకల్యాణోత్సవం నిర్వహించారు.

GOD : పవనపుత్రా పాహిమాం..!
Penukonda Uru Vakili Anjaneyaswamy in special decoration

భక్తి శ్రద్ధలతో హనుమజ్జయంతి

(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్ఖ్‌)

హనుమజ్జయంతి వేడుకలను ఆంజనేయ స్వామి ఆలయాల్లో శనివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే మూల విరాట్లకు వివిధ అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. అలాగే హనుమాన చాలీసా పారా యణం, భజనలు, రామ కీర్తనలు, రామ నామం, ఆంజనేయ దండకంతో ఆలయాలు మార్మోగాయి. పలు ఆలయాల్లో సీతారామకల్యాణోత్సవం నిర్వహించారు. తీర్థ ప్రసాద వినియోగంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే సాయంత్రం స్వామి ఉత్సవ విగ్రహా లను, చిత్రపటాలను ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు. హిందూపురంలోని మునిసిల్‌ కార్యాలయం వద్ద ఉన్న వేంకటేశ్వరాల యంలో స్వామిని ఆంజనేయుడిగా అలంకరించి, వడల హారంతో పూజలు చేశారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 01 , 2024 | 11:54 PM