Share News

TDP: పెద్దపప్పూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా

ABN , Publish Date - May 04 , 2024 | 12:30 AM

టీడీపీ అధికారంలోకి రాగానే మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. మండలంలోని చీమలవాగుపల్లి, నరసాపురం, పసలూరు, దేవునిఉప్పలపాడు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.

TDP: పెద్దపప్పూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతా
రోడ్‌షోలో మాట్లాడుతున్న అశ్మితరెడ్డి

కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి

పెద్దపప్పూరు, మే 3: టీడీపీ అధికారంలోకి రాగానే మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి అన్నారు. మండలంలోని చీమలవాగుపల్లి, నరసాపురం, పసలూరు, దేవునిఉప్పలపాడు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. మండలంలో ప్రధానంగా చేనేత కార్మికులు ముడిసరుకుల ధరలు పెరగడంతో గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంటపొలాలకు సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు లేవన్నారు. చాగల్లు, పెండేకల్లు రిజర్వాయర్లకు నీరు తెప్పించే బాధ్యత వ్యక్తిగతంగా తనదని ప్రజలకు హామీ ఇచ్చారు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. తెలుగుయువత ఉపాధ్యక్షుడు తాతిరెడ్డి లోకనాథ్‌రెడ్డి, శ్రీకాంతరెడ్డి, శశిధర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, భాస్కర్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, గుర్తిరఘునాయుడు, విష్ణువర్దనరెడ్డి, పాల్గొన్నారు.


10కుటుంబాలు టీడీపీలో చేరిక: మండలంలోని బొందలదిన్నె గ్రామానికి చెందిన 10 కుటుంబాలు శుక్రవారం టీడీపీలో చేరాయి. జేసీ అశ్మితరెడ్డి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో త్రినాథ్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డితోపాటు పలువురు ఉన్నారు.

సైకోను సాగనంపితేనే రాష్ట్రం సురక్షితం

యాడికి: రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సైకోను సాగనంపితేనే ప్రజలు సురక్షితంగా ఉంటారని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం యాడికిలో జేసీ పవనరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు రోడ్‌షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సమావేశం నిర్వహించారు. దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ పేరుతో ప్రజల భూములన్నింటిని జగన దోచేయడానికి చూస్తున్నాడన్నారు. రాష్ట్రానికి పట్టిన ఈ సైకోను ఎన్నికల్లో సాగనంపాలని పిలుపునిచ్చారు. క్లాస్‌-1 కాంట్రాక్టర్‌ చవ్వా గోపాల్‌రెడ్డి, మండల కన్వీనర్‌ రుద్రమనాయుడు, మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, జనసేన మండల కన్వీనర్‌ సునీల్‌కుమార్‌, పరిమి చరణ్‌, కులశేఖర్‌నాయుడు, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.


అభివృద్ధి పథంలో నడిపిస్తాం

తాడిపత్రిటౌన: కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, జేసీ అశ్మితరెడ్డిలను గెలిపిస్తే తాడిపత్రిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని జేసీ పవనరెడ్డి అన్నారు. పట్టణంలోని ఓంశాంతినగర్‌లో శుక్రవారం ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మెయినబజారులోని పెద్దమ్మ ఆలయంలో పవనరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కౌన్సిలర్‌ జింకా లక్ష్మిదేవి, జనసేన నియోజకవర్గ ఇనచార్జి కదిరి శ్రీకాంతరెడ్డి, నాయకులు హరినాథ్‌రెడ్డి, ఖాదర్‌బాషా, పవనకుమార్‌రెడ్డి, రోషన్న, దినే్‌షరెడ్డి, నరేంద్రనాయుడు, లోకనాథ్‌రెడ్డి, మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 12:30 AM