PENSION: ఇంటివద్దకే పింఛన
ABN , Publish Date - Jun 28 , 2024 | 11:51 PM
ఎన్టీఆర్ భరోసా పింఛన పథకం కింద జూలై 1 పింఛన సొమ్ము ఇంటివద్దకే లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామమోహన తెలిపారు.
తాడిపత్రిటౌన, జూన28: ఎన్టీఆర్ భరోసా పింఛన పథకం కింద జూలై 1 పింఛన సొమ్ము ఇంటివద్దకే లబ్ధిదారులకు అందజేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామమోహన తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం సచివాలయ సిబ్బందికి పింఛన్ల పంపిణీపై శిక్షణ ఇచ్చారు. పంపిణీలో పాటించాల్సిన మెలకువలను వివరించారు.
యల్లనూరు: మండలంలో 1నుంచి ఇంటింటికి పింఛన్ల పంపిణీ కోసం 123మంది సిబ్బందిని నియమించినట్లు ఎంపీడీఓ వీరరాజు తెలిపారు. 21 గ్రామ పంచాయతీల్లో 6656మంది పింఛనదారులు ఉన్నారు. వీరికి 1వ తేదీన పింఛన్లు పంపిణీ చేయడానికి అన్ని గ్రామ సచివాలయాల సిబ్బందితోపాటు, వ్యవసాయ మండల సర్వేయర్లను నియమించామన్నారు.
గుత్తి: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు. స్ధానిక మున్సిపల్ కౌన్సిల్ హల్‌లో శుక్రవారం మున్సిపల్, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సామాజిక భద్రతా పింఛన్లను జూలై1నుంచి పింఛనుదారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
బెళుగుప్ప: ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఉదయం 6 గంటల నుంచే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఈవోఆర్డీ మాధవరెడ్డి సిబ్బందికి సూచించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పింఛన్ల పంపిణీపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పింఛన కోసం సచివాలయం వద్దకు వెళ్లక ండి
రాయదుర్గం: లబ్ధిదారులు పింఛన కోసం సచివాలయాల వద్దకు వెళ్లవద్దని మున్సిపల్ కమిషనర్ కిషోర్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులందరికీ 1వ తేదీ నుంచి సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేస్తామన్నారు.