Share News

AGITATION FOR WATER: తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు

ABN , Publish Date - Oct 07 , 2024 | 11:37 PM

మండలంలోని బాపనకుంట, ఎస్సీకాలనీ, నేరాలవంకతండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు రెడ్డిపల్లి ప్రధాన రోడ్డులో ధర్నా చేపట్టారు. సోమవారం వారు మాట్లాడుతూ బాపనకుంట సమీపంలో గ్రీనఫీల్డ్‌ హైవే రహదారి పనులు జరుగుతున్నాయన్నారు.

AGITATION FOR WATER: తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు
People protesting on the road

నల్లమాడ , అక్టోబరు 7: మండలంలోని బాపనకుంట, ఎస్సీకాలనీ, నేరాలవంకతండాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్థులు రెడ్డిపల్లి ప్రధాన రోడ్డులో ధర్నా చేపట్టారు. సోమవారం వారు మాట్లాడుతూ బాపనకుంట సమీపంలో గ్రీనఫీల్డ్‌ హైవే రహదారి పనులు జరుగుతున్నాయన్నారు. పనుల్లో భాగంగా అక్కడ బ్రిడ్జి నిర్మిస్తున్నారని, దీంతో సాయిబాబా తాగునీటి పైపులైన దెబ్బతినిందన్నారు. నాలుగు నెలలుగా ఆయా గ్రామాలకు తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు పంచాయతీ నీరు కూడా గ్రామాలకు రావడంలేదన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు. స్పందించిన గ్రీనఫీల్డు హైవే మేనేజర్‌ సుధాకర్‌రెడ్డి రెండుమూడు రోజుల్లో పైపులైన మరమ్మతు చేసి తాగునీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్థులు రాజశేఖర్‌రెడ్డి, వెంకటరమణ , చెన్నారెడ్డి సుందర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, రవీంద్రారెడ్డి, నాగమ్మ, గంగరత్న, గంగాదేవి, గంగులమ్మ పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2024 | 11:37 PM