PUTTAPARTI : హిమాచల్ భక్తుల పర్తియాత్ర
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:43 AM
హిమాచల్‌ప్రదేశకు చెందిన 500 మంది భక్తులు శనివారం పర్తియాత్ర పేరుతో ప్రశాంతినిలయం చేరుకున్నారు. సాయికుల్వంత సభా మండపంలో సాయంత్రం భక్తిగీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. అలాగే బాలవికాస్ విద్యార్థులు శివపురాణం, మహాభారతంలోని భక్తి పాటలకు నృత్యప్రదర్శన చేశారు. గంటపాటు సంగీతం, నృత్యాలతో అలరించారు.
పుట్టపర్తి, జూలై 27: హిమాచల్‌ప్రదేశకు చెందిన 500 మంది భక్తులు శనివారం పర్తియాత్ర పేరుతో ప్రశాంతినిలయం చేరుకున్నారు. సాయికుల్వంత సభా మండపంలో సాయంత్రం భక్తిగీతాలాపన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. అలాగే బాలవికాస్ విద్యార్థులు శివపురాణం, మహాభారతంలోని భక్తి పాటలకు నృత్యప్రదర్శన చేశారు. గంటపాటు సంగీతం, నృత్యాలతో అలరించారు. హిమాచల్ ప్రదేశలో నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాల గురించి ఆ రాష్ట్ర సేవా సంస్థల అధ్యక్షుడు యోగీంద్రవర్మ వివరించారు. అనంతరం వారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....