Share News

PUTLUR POLICE : తోటలో ఆట

ABN , Publish Date - Jul 26 , 2024 | 11:28 PM

అది ఓ అరటి తోట. ఏపుగా పెరిగింది. లోపల ఎవరున్నారో? ఏం జరుగుతోందో కూడా తోట బయట ఉన్న వారికి తెలియదు. లోపల అసలు మనుషులు ఉన్నారన్న అనుమానం కూడా రాదు. ఇదే ఓ వైసీపీ నాయకుడి అక్రమ సంపాదనకు మార్గంగా మారింది. అందుకే ఆయన మూడు ముక్కల ఆటతో చెలరేగిపోతున్నాడు. ఈ ఆట వైసీపీ పాలనలో మొదలై నేటికీ కొనసాగుతోంది. అయితనా దీన్ని ఆపేవారు లేరు. ఈ తతంగమంతా పుట్లూరు మండలంలో యథేచ్ఛగా సాగుతోంది. పోలీసుల అండదండలతోనే వైసీపీ ...

PUTLUR POLICE : తోటలో ఆట
Putlur Police Station

పుట్లూరు మండలంలో జోరుగా పేకాట స్థావరాలు

వైసీపీ నాయకుడి అరటి తోటలో ఆట

తోటలోనే మధ్యాహ్నం ముక్క, చుక్క

రోజూ రూ.15లక్షల నుంచి రూ.20లక్షలకు పైగానే ఆట

మంగపత్తాతో రోడ్డున పడుతున్న జీవితాలు

ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు

తాడిపత్రి, జూలై 26: అది ఓ అరటి తోట. ఏపుగా పెరిగింది. లోపల ఎవరున్నారో? ఏం జరుగుతోందో కూడా తోట బయట ఉన్న వారికి తెలియదు. లోపల అసలు మనుషులు ఉన్నారన్న అనుమానం కూడా రాదు. ఇదే ఓ వైసీపీ నాయకుడి అక్రమ సంపాదనకు మార్గంగా మారింది. అందుకే ఆయన మూడు ముక్కల ఆటతో చెలరేగిపోతున్నాడు. ఈ ఆట వైసీపీ పాలనలో మొదలై నేటికీ కొనసాగుతోంది. అయితనా దీన్ని ఆపేవారు లేరు. ఈ తతంగమంతా పుట్లూరు మండలంలో యథేచ్ఛగా సాగుతోంది. పోలీసుల అండదండలతోనే వైసీపీ నాయకుడు తన అరటితోటను పేకాట స్థావరంగా మార్చుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. సుబ్బరాయసాగర్‌ వద్ద ఓ వైసీపీ నాయకుడు తన అరటితోటలో పదుల సంఖ్యలో ఆటగాళ్లను రప్పించి పేకాట ఆడిస్తున్నట్లు తెలిసింది. ఈ తతంగమంతా పోలీసు అధికారులకు తెలిసినా తెలియనట్లు ఉన్నారనే ఆరోపణ


లు వినిపిస్తున్నాయి. ఈ పేకాటకేంద్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారేమో గానీ పుట్లూరు మండలంలోని పలు గ్రామాల్లోని కొండ ప్రాంతాలను స్థావరాలుగా ఏర్పాటు చేసుకొని పేకాట ఆడిస్తున్నారు. ఈ వ్యవహారంలో పలువురు వైసీపీ నాయకులే సూత్రధారులుగా ఉండటం గమనార్హం. పోలీ్‌సస్టేషనకు ఎంతో కొంత ముట్టజెప్పి తమవ్యాపారాన్ని నిరాటంకంగా సాగిస్తున్నట్లు సమాచారం.

చేతులు మారుతున్న లక్షలు

సుబ్బరాయసాగర్‌ వద్ద ఉదయం 9 గంటలకే పేకాట ప్రారంభమవుతోంది. మధ్యాహ్న సమయంలో నిర్వాహకుడే బిరియాని, మద్యం తెప్పిస్తార ట. పేకాటరాయుళ్లు అక్కడే తింటూ, తాగుతూ పేకాటలో మునిగిపోతు న్నట్లు సమాచారం. సాయంత్రం 3గంటల నుంచి 4గంటల్లోపు ఆట కట్టేసి తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. పేకాట ఆడేందుకు అనంతపురం, నంద్యాల, పులివెందుల, తాడిపత్రితోపాటు పలు ప్రాంతాల నుంచి ఆటగాళ్లు పెద్దఎత్తున కార్లు, ద్విచక్రవాహనాల్లో తరలి వస్తారు. కొండ ప్రాంతం కావడంతో పరిసర గ్రామాల రైతులు డ్యాం వద్దకు వెళుతున్నారులే అనుకుంటున్నారు. ఒక రోజుకు సుమారు రూ.15లక్షల నుంచి 20లక్షలకు పైగా ఆట జరుగుతున్నట్లు సమాచారం.

మధ్యాహ్నం మంగపత్తా

ప్రతిరోజూ ఉదయం ఒక ఎత్తు. మధ్యాహ్నం అయిందంటే మరో ఎత్తుగా ఆట కొనసాగుతోంది. ఉదయం పేకాటతో మొదలైన ఈ తతంగం మధ్యా హ్నం ముగుస్తుంది. ఈ ఆటలో చాలా సమయం తర్వాత కొద్దిమొత్తంలో మాత్రమే సంపాదిస్తుంటారు. కానీ మధ్యాహ్నం జరిగేదే అసలైన ఆట. అదే మంగపత్తా. కేవలం ఒక ఆటతోనే లక్షలు చేతులు మారతాయి. అది కూడా నిమిషాల వ్యవధిలోనే. ఇలా ఏకధాటిగా రెండుగంటల పాటు జరిగే మంగపత్తా ఆటలో ఎంతో మంది వేలు, లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆటలో సర్వం కోల్పోయినవారి జీవితాలు రోడ్డున పడుతున్నాయి. పేకాటకు బానిసైన వారు కొందరు, ఆస్తులు అమ్మి, మరికొందరు అప్పులు చేసి మరీ ఆట ఆడుతున్నారు. ఓడిపోయినవారు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో వారు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి.

చూసీచూడనట్లుగా పోలీసులు

మండలకేంద్రానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం లో జరుగుతున్న పేకాట పోలీసులకు తెలియదంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఒకవేళ వారికి సమాచారం ఉన్నా మామూళ్లు అందుతుండటంతో మిన్నకుండిపోతున్నారేమో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంత భారీస్థాయిలో పేకాట జరుగుతోందంటే అందరికి ముడుపులు అందుతున్నట్లే అన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల కాలంలో మండలంలో పేకాటరాయుళ్లను అరె్‌స్టచేసిన సందర్భాలు లేక పోవడమే నిదర్శనం. ఈ చీకటి పేకాటతో పరిసర తోటల యజమానులు, మహిళా రైతులు అటువైపు వెళ్లాలంటే జంకుతున్నారని సమాచారం.

సమాచారం ఇవ్వండి : సుబ్రహ్మణ్యం, సీఐ

పుట్లూరు మండలంలో పేకాట, మంగపత్తా ఎక్కడా ఆడుతున్నట్లు సమాచారం లేదు. ఒకవేళ ఆడుతున్నట్లు మీ దృష్టికి వస్తే మీడియానే మాకు సమాచారం ఇవ్వాలి. పేకాట ఆడేవారు, ఆడించేవారు ఇద్దరూ శిక్షార్హులే. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 26 , 2024 | 11:28 PM