POLL : ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్
ABN , Publish Date - May 14 , 2024 | 01:19 AM
పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో సోమవారం ఉదయం 7గంటల కే ఓటర్లు బారులుతీరారు. అయితే గంటపాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల అధికారులకు పూర్తి అవగాహన లేకపోవడంతో ఆలస్యమైనట్లు తెలిసింది. నోడల్ అధికారి చొరవతో 7-58కి ప్రారంభమైంది. ఉక్కపోత అధికంగా ఉన్నా ఓటర్లు గంటలకొద్ది కూలో నిలబడి ఓటేసి వెళ్లారు. పెనుకొండ మండలంలో ఎన్నికల నిబంధనలను ఆయా పార్టీ నాయకులు ఉల్లంఘించడంతో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నా యి.
పెనుకొండ టౌన, మే 13 : పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో సోమవారం ఉదయం 7గంటల కే ఓటర్లు బారులుతీరారు. అయితే గంటపాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల అధికారులకు పూర్తి అవగాహన లేకపోవడంతో ఆలస్యమైనట్లు తెలిసింది. నోడల్ అధికారి చొరవతో 7-58కి ప్రారంభమైంది. ఉక్కపోత అధికంగా ఉన్నా ఓటర్లు గంటలకొద్ది కూలో నిలబడి ఓటేసి వెళ్లారు. పెనుకొండ మండలంలో ఎన్నికల నిబంధనలను ఆయా పార్టీ నాయకులు ఉల్లంఘించడంతో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నా యి. మావటూరు, పెనుకొండ పట్టణంలోని ఉన్నతపాఠశలలో పోలీసులు ఓట ర్లను అదుపుచేసే క్రమంలో దురుసుగా ప్రవర్తించారు. టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత పెనుకొండ పట్టణంలోని జీఐసీ కాలనీలో ఓటుహక్కు వినియోగిం చుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి మ ధ్యాహ్నం ఓటువేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయం లోనే తమ గెలుపును నిర్ధారించారని, ఈ ఎన్నికలు మెజార్టీ కోసమే అన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....