water problem:తాటిమానుగుంతలో తాగునీటి ఎద్దడి
ABN , Publish Date - Apr 22 , 2024 | 01:16 AM
నంబులపూలకుంట, ఏప్రిల్ 21: మండలంలోని తాటిమానుగుంతలో గత 15రోజులనుంచి తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి నీటిని సరఫరా చేసే రక్షిత తాగునీటి బోరులో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో ట్యాంక్‌కు నీరు సరిగా సరఫరా కావడం లేదు. వచ్చిన అరకొర నీటినే కొళాయి ద్వారా పట్టుకుంటున్నామని, అయితే అవి ఎక్కడా సరిపోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.

అరకొర నీటి కోసం ట్యాంకు వద్ద గంటలకొద్ది పడిగాపులు కాయాల్సి వస్తోందంటున్నారు. చేసేదిలేక చాలామంది సమీపంలోకి వ్యవసాయ పొలాలకు వెళ్లి అక్కడి బోర్ల వద్ద నుంచి నీరు తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. గ్రామంలో తాగునీటి సమస్య గురించి పలుమార్లు అధికారులకు విన్నవించామని, ఫలితం లేకపోయిందని అంటున్నారు. ఇప్పటికైనా అఽధికారులు స్పందించి గ్రామంలో నెలకున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...