Home » Village development
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం జనాభా ఆధారంగా వాటిని A, B, C కేటగిరీలుగా విభజించింది. ఉద్యోగుల నియామకం, అవసరాలను తేల్చుతూ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది
ఒకప్పట్లో ఊర్లో చెత్తను శివార్లలో పడేసేవారు. కొండల్లా పేరుకుపోయి దుర్గంధం నెలకొనేది. పర్యావరణ సమస్యతో పాటు స్థానికులూ అనారోగ్యం బారిన పడేవారు. ‘స్వచ్ఛ పల్లె’ నినాదంతో అలాంటి చెత్త నుంచి సంపద సృష్టించేలా ఏడేళ్ల కిందట సీఎం హోదాలో చంద్రబాబు రూపకల్పన చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వీటిని నిర్లక్ష్యంగా వదిలేయగా.. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వంలో లక్ష్యం దిశగా అడుగులేసింది. ఫలితం మూడు నెలల్లో జిల్లాలోని పంచాయతీలకు రూ.13.5 లక్షల ఆదాయం వచ్చింది.
ఇంట్లో పొద్దున లేచింది మొదలు ఒకటే ఆలోచన! చాయ్ తాగేందుకు పాలు ఎలా అని కాదు.. వంట కోసం కూరలు, పప్పులు ఎలా అనీ కాదు. గొంతు తడుపుకోవడానికి, ఇతర అవసరాలకు నీళ్లు ఎలా అనే! కుళాయిల్లో నిండుగా వచ్చే ధార బాగా సన్నబడింది.. నల్లానీరు వదిలే టైమూ తగ్గిపోయింది.
రాష్ట్రంలో గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని సంకల్పించిన ప్రభుత్వం.. ఆ మేరకు కసరత్తు ముమ్మరం చేస్తోంది. దీనిపై అధ్యయనం చేయాల్సిందిగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు గతంలోనే సూచించింది.
మన జాతిపిత మహాత్మా గాంధీ మాటను ఇప్పుడు తప్పక ప్రస్తావించుకోవాల్సిందే.. ఎందుకంటే నాడు గాంధీతాత కన్న గ్రామస్వరాజ్యం కల నేడు నెరవేరబోతున్నందుకు..
స్వయం సమృద్ధ్ధి సాధించేలా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని అధికారులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు.
ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23న చేపట్టనున్న గ్రామసభలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఆర్వోఆర్-2024 ముసాయిదాను ప్రజల్లోకి తీసుకువెళతామని లైసెన్స్డ్ సర్వేయర్లు వెల్లడించారు.
కల్కి సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్.. శ్రీమంతుడు సినిమా హీరో మహే్‌షబాబు తరహాలో స్వగ్రామం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు.
వైద్య ఆరోగ్యశాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు రేవంత్ సర్కారు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల వేతనాలు భారీగా పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.